విద్యను నిర్లక్ష్యం చేస్తే అన్ని రంగాల్లో వెనుకబడిపోతామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎస్‌టియు ఆధ్వర్యంలో ప్రెండ్స్‌కల్యాణ మండపంలో విద్యపై సమావేశం నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా రంగ అభివృద్ధికి ఉపాధ్యాయులు అకుంటిత దీక్షతో కృషి చేయాలన్నారు. విద్యా విధానంలో నాణ్యత ప్రమాణాలను ప్రభుత్వం పాటిస్తోందన్నారు. దేశాభివృద్ధి ఉపాధ్యాయులపై ఆధారపడి వుందని పేర్కొన్నారు. ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ సమస్యల పరిష్కరానికి రాష్ట్ర మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. వ్యాపారం కోసం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కార్పొరేట్ కళాశాల విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు మంత్రి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే ప్రతి ఒక్కరు పేదలే ఉంటారని, అలాంటి వారికి విద్యను అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. రాజీవ్ విద్యామిషన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ మహమ్మద్ ఆలీ రాఫత్ మాట్లాడుతూ మానవతా విలువల రక్షణకు విద్యే కారణమని ఉపాధ్యాయులు ఉత్తమ విద్యను బోధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత ప్రమాణాలు కల్గిన విద్యను అందిస్తున్నామని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అన్ని రకాల శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మోహన్, టివి రెడ్డి, రాజీవ్ విద్యమిషన్ ఆఫీసర్ చిట్టిబాబు, ఆర్‌విఎం ఎఎంఒ చంద్రయ్య, డివైఇఓ శ్యామూల్, మున్సిపల్ ఛైర్మన్ కె.నాగభూణం, ఎంపిపి వెంకటరెడ్డి యాదవ్, కమిషనర్ వెంకటరమణ, ఎంఇఓ రెడ్డెప్ప పాల్గొన్నారు.
స్వైన్ఫ్లూ నిరోధానికి చర్యలు తీసుకోవాలి
నెమళి స్వాధీనం
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
ఏడుకొండల స్వామీ..ఏడు విన్నపాలివే!
ఈసారైనా పరిష్కరిస్తారని...
జిల్లా వాసులకే టిటిడిలో ఉద్యోగాలు కల్పించాలి: పిఆర్పి
సకాలంలో పన్నులు చెల్లించి
పోరాటాలతోనే బిఎస్ఎన్ఎల్ పరిరక్షణ: అశోక్బాబు
5 నుండి గోవింద కల్యాణాలు