ఎఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలి

యూరోపియన్‌ ఎఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా అధ్య క్షులు చైతన్య డిమాండు చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో యూరోపియన్‌ ఎఎన్‌ఎంల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తులసిరామ్‌ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఎఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలన్నారు. ఇతర ఎఎన్‌ఎంలతో పాటు వీరికి కూడా సమాన వేతనం ఇవ్వాలని డిమాండు చేశారు. యూరోపియన్‌ ఎఎన్‌ఎంల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదన్నారు. జిల్లాలో 104 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. చైతన్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించే యూరోపియన్‌ ఎఎన్‌ఎంలను ప్రభుత్వం గుర్తించి వీరికి ఉన్న హక్కులను కల్పించాలని డిమాండు చేశారు. సమావేశం అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆ సంఘం గౌరవ అధ్యక్షులుగా చైతన్య, అధ్యక్ష, కార్యదర్శులుగా మోహనమ్మ, కోకిల, కోశాధికారిగా లలిత, ఉపాధ్యక్షులుగా మేరి, రేవతి, లక్ష్మీదేవి, సహాయ కార్యదర్శులుగా పుష్పలత, చందన, జ్యోతిరాణిలతో పాటు మరో 11మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

"); -->