జాతీయత...
టీచర్: అరే రామూ! నీ జాతీయత ఎక్కడ?
రామూ: మా అమ్మ ఐస్‌లాండ్‌లో పుడితే, మానాన్న క్యూబాలో పుట్టారు.
టీచర్: అయితే నువ్వు ఐస్‌క్యూబా?
రామూ: ఆ....
పైన...
తండ్రి: ఏంట్రా గోపీ! పోగ్రస్ రిపోర్టు అలమరాలో పైన పెట్టావు..
గోపి: మా టీచర్ రిపోర్టు ఇస్తూ కీప్ ఇట్ అప్ ఇన్ ది రిపోర్ట్ అన్నారు. అందుకే పోగ్రస్ రిపోర్టు అలమరాలో పైన పెట్టాను.
టీచర్: ఆ.............
పన్ను...
రాము: నాన్నా! మా క్లాసులో అబ్బాయి నన్ను కొట్టాడు..
తండ్రి: వాడిని గుర్తుపట్టగలవా?
రాము: తప్పకుండా గుర్తుపడతాను నాన్న! ఎందుకంటే వాడి పన్ను ఒకటి నా దగ్గరే ఉంది.
తండ్రి : ఆ............
- ఓ.నవ్య, హైదరాబాద్.