నేగి సంచలనం

    ఖాంటీమాన్సిస్క్‌ (రష్యా): ప్రపంచంలో రెండవ అతిపిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు నెలకొల్పిన పరిమార్జన్‌ నేగి ప్రపంచ చెస్‌ కప్‌లో సంచలనం సృష్టించాడు. స్విట్జర్లాండ్‌కు చెందిన వ్లాదిమిర్‌ మిలోవ్‌తో జరిగిన గేమ్‌లో విజయం సాధించి ఈ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకునే అవకాశాలను మెరుగు పరచుకున్నాడు. భారత్‌ జాతీయ ఛాంపియన్‌ సూర్యశేఖర గంగూలీ, సాందీపన్‌ చందా కూడా తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించారు. అయితే కృష్ణన్‌ శశికిరణ్‌ హాలెండ్‌కు చెందిన ఎర్విన్‌ ఎల్‌అమితో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో రెండోరౌండ్‌కు చేరుకునే అవకాశాలు శశికిరణ్‌కు సన్నగిల్లాయి. అంతర్జాతీయ మాస్టర్‌ శ్రీరామ్‌ ఝా, గ్రాండ్‌మాస్టర్‌ అభిజిత్‌ కుంటే తమతమ మ్యాచ్‌లను డ్రా చేసుకున్నాడు. గత ఏడాది జూని యర్‌ ఛాంపియన్‌ అభిజిత్‌గుప్తా రష్యాకు చెందిన తన కంటే ఎక్కువ ర్యాంక్‌గల నిఖితా విట్యుగోవ్‌తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.నేగి సంపూర్ణ పరిపక్వత ప్రదర్శించాడు. ప్రత్యర్థి ప్రయోగించిన బెర్లిన్‌ డిఫెన్స్‌ను సమ ర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ప్రత్యర్థికి ఎంతమాత్రం అవకాశమివ్వలేద్పుమరోవైపు ఆనంద్‌ తరువాత దేశంలో అంతటి ప్రతిభాశాలిగా పేరుగాంచిన గంగూలీ నింజో ఇండియన్‌ డిఫెన్స్‌తో ప్రత్యర్థిని చిత్తుచేసాడు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్