దేశానికే మణిరత్నంనాల్కో

ప్రపంచ పారిశ్రామిక రంగంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మన ప్రభుత్వరంగ సంస్థ నాల్కో సాధించిన ఫలితాలు అద్భుతం. ఆర్ధికమాంద్యంలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగంపై పడుతుంటే మన ప్రభుత్వరంగం తన సత్తా చాటుతోంది. 2008-09 ఫలితాలలో 100% ఉత్పత్తి ఫలితాలను సాధించి దేశంలో నవరత్న కంపెనీల సత్తా చాటిచెప్పింది. 2008-09 గాను రూ|| 5631 కోట్ల టర్నోవర్‌తో రూ|| 1272 కోట్ల లాభాలను సంస్థ సాధించింది. ఈ ఆర్ధిక సం||లో 1,2వ క్వార్టర్‌లలో ఉత్తమ ఫలితాలను సాధించి ముందుకు సాగుతోంది.

1981లో స్థాపించిన ప్రభుత్వరంగ సంస్థ నాల్కో ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ అల్యూమినియం కాంప్లెక్స్‌గా వెలుగొందుతోంది. బాక్సైట్‌ గనుల మైనింగ్‌, అల్యూమినియా రిఫైనింగ్‌, అల్యూమినియం స్మెల్టరింగ్‌ మరియు కాస్టింగ్‌, విద్యుత్‌ ఉత్పత్తి, రైలు మరియు పోర్టు సదుపాయాలతో ముందుకు దూసుకుపోతున్న ఐఎస్‌ఒ 9001-2000 సర్టిఫికేట్‌ కలిగిన అతిపెద్ద నవరత్న కంపెనీ పర్యావరణానికి సంబంధించి ఐఎస్‌ఓ 14001 సర్టిఫికేట్‌ కలిగిఉంది. కంపెనీ స్థాపన తరువాత మెరుగైన ఫలితాలను సాధించి, 2వ ఫేస్‌ విస్తరణ 5000 కోట్లతో చేపట్టింది. దాని నిర్మాణం పూర్తి కావస్తుంది. 3వ ఫేస్‌ విస్తరణ 6000 కోట్లతో భవిష్యత్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో ప్లాంట్‌ కెపాసిటీ 5.80 టన్నులు మరియు విద్యుత్‌ ఉత్పత్తి 1400 మెగావాట్స్‌ పెరుగుతుంది.

బాక్సైట్‌ గన్నులు

నాల్కో 48,00,000 టిపిఎ బాక్సైట్‌ మైనింగ్‌ చేయటానికి సరిపడా గనులు ఒరిస్సాలో పంచపటమలి (కోరాపుట్‌ జిల్లా) ఉన్నాయి. పర్యావరణం పాడవకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిస్థాయి కంప్యూటరీకరణతో ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ జరుపుతోంది. 14.6 కిలోమీటర్ల కన్వెయర్‌ బెల్ట్‌తో అతి దగ్గరలో కర్మాగారం కలిగిఉంది.

అల్యూమినియం రిఫైనరీ

ప్రపంచంలోనే 10 అతిపెద్ద అల్యూమినియం రిఫైనరీలలో నాల్కో 26,000 టిపిఎ స్పెషల్‌ గ్రేడ్‌ అల్యూ మినియం మరియు హైడ్రేట్‌ ఉత్పాదకశక్తి కలిగిన ఉన్న కంపెనీ. ఉత్పత్తిని ఎగుమతులు విశాఖ పోర్టు నుండి చేస్తోంది. అల్యూమినియం స్పెల్టర్‌లో 3,45,000 టిపిఎ ఉత్పాదక శక్తి కలిగిన మిషనరీలో 240 ఎలోటరైట్‌ ఫోటో సెల్స్‌ కలిగి ఉంది. దీనిలో ఇన్‌గాట్స్‌, స్వాట్స్‌, బిల్లెట్స్‌, వైర్లు, స్ట్రిప్స్‌, రాడ్స్‌ని ఉత్పత్తి చేస్తుంది. విదేశీ పరిజ్ఞానంతో 56,000 టిపిఎ లోడింగ్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది. నాల్కో ఆల్యూమినియంలో ప్రపంచస్థాయి మేటి అల్యూమి నియం ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఉత్పత్తులలో ఉన్నత దశ సాధించిన ఈ సంస్థ లండన్‌ మెటల్‌ ఎక్స్ఛేంజ్‌లో కూడా నమోదు చేసుకుంది. దేశీయ అవస రాలను తీరుస్తూనే విదేశీ ఎగుమతులతో ముందుకు సాగుతోంది.

పర్యావరణం సంరక్షణ

వాతావరణం కాలుష్యానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తూ అనేక చర్యలు చేపట్టింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటంలో ఐఎస్‌ఒ 14001 నిబంధనలను పాటిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుతూ భారత ప్రభుత్వంచే ''ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర పురస్కార్‌'' అవార్డుని చేజిక్కించుకుంది.

సిఎస్‌ఆర్‌

సమాజానికి తన వంతు పాత్రగా అనేక కార్యక్రమాలు నాల్కో చేపడుతుంది. ఉత్పత్తి కేంద్రానికి పరిసర ప్రాంత గ్రామాలలో ప్రజల కోరకు అనేక కార్యక్రమాలు చేపడుతుంది. నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం, మౌళిక వసతులు, ఉద్యోగలు, కల్పించాడంలో నాల్కో ముందు ఉంది. పరిసర గ్రామాలలో మంచి నీటి సదుపాయలు, పారిశుద్యం, సామాజిక అడవుల పెంపకం, గ్రామ ప్రజలకు ఆటలు, సాంకృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇవే కాకుండా వ్యవసాయంలో ఆధునిక పద్దతులు, గ్రామీణా ప్రాంతలో విద్య కోసం స్కూళ్ల నిర్వహణ, మెడికల్‌ క్వేంపులు నిర్వహిస్తు ప్రజల ఆరోగ్య పరిరక్షణలోను ఎంతో ముందుంది. ఉద్యోగుల బద్రత, సంక్షేమంలో కూడా నాల్కో ముందుంది.

యూనిట్‌ 1వ దశ విస్తరణ 2వ దశ విస్తరణ

బాక్సైట్‌ గనులు 48,00,000 మె||ట|| 63,00,000 మె||ట||

అల్యూమినియం రిఫైనరీ 15,75,000 మె||ట|| 21,00,000 మె||ట||

అల్యూమినియం స్మెల్టర్‌ 3,45,000 మె||ట|| 4,60,000 మె||ట||

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం 960 మెగావాట్లు 1200 మెగావాట్లు

అనుముకోండ సురేష్‌, ప్రజాశక్తి, విశాఖపట్నం.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్