రాజశేఖర్‌ కేసులో ఇరువర్గాల రాజీ

ఒక దాడి కేసులో సాక్ష్యమివ్వడానికి సినీనటుడు హీరో డాక్టర్‌ రాజశేఖర్‌, జీవిత రాజశేఖర్‌లు గురువారం కోర్టు ముందు హాజరయ్యారు. 2007 జనవరి 28వ తేదీన రాజశేఖర్‌, జీవిత తమ పిల్లలతో భీమవరం నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా పంజాగుట్ట పరిధిలో కొంతమంది దుండగులు తమపై దాడి చేశారంటూ అప్పట్లో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో రాజశేఖర్‌, ఆయన కుమారుడికి స్వల్ప గాయాలు అయ్యాయని వారు తమ దరఖాస్తులో పేర్కొన్నారు. దాడి చేసిన దుండగులను తాము గుర్తుపట్టలేమని కోర్టు ముదు సాక్ష్యమిచ్చారు. పరోక్షంగా ఇరు వర్గాలు ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఒకరికొకరు రాజీపడ్డారు.

Sorry

java.lang.NullPointerException