చత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంద్ర మీదుగా అల్పపీడన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతుంది. దీనికి తోడు ఈ రోజు సాయంత్రం క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశంమున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. క్యూములో నింబస్ మేఘాలు దట్టంగా ఉన్న ప్రాంతాల్లో ఈదురుగాలులుతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.