గిరిజన విద్యాలయాల సంస్థ చైర్మన్‌గా మంత్రి బాలరాజు

  • ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన విద్యాలయాల సంస్థ కమిటీ చైర్మన్‌గా గిరిజన శాఖ మంత్రి బాలరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్‌ ఛైర్మన్‌గా గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి విద్యాసాగర్‌ను నియమించింది. నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలో 12 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా, ఏడుగురిని నామినేటెడ్‌ సభ్యులుగా నియమించింది. గతంలో ఈ కమిటీకి గిరిజన శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించేవారు.

"); -->