ఉదయాన్నే లేచి చల్లటి, ఆహ్లాదకర వాతావరణంలో మార్నింగ్ వాక్‌కు బయలుదేరిన మనకు పార్క్‌లో నడుస్తూ చిరునవ్వుతో పలుకరించే అనేక మందితో పాటు కొన్ని విభిన్నమైన దృశ్యాలు కూడా కన్పిస్తుంటాయి. బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో ఉదయం నడిచే వందలాది మంది వ్యక్తులకు ఈ దృశ్యాలు సుపరితమే వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి శాఖ కార్యా లయం సుందరయ్య పార్కులోనే ఉంది. ఆరోగ్యంగా జీవించే ఆరోగ్య సూత్రాలతో పాటు అనేక సేవాకార్యక్రమాలను వాకర్స్‌క్లబ్ నిర్వహి స్తుంది. ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ క్లబ్ ఇప్పటికి వేలాది కార్యక్రమాలను నిర్వహించింది. ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ప్రజాశక్తి వాకర్స్‌క్లబ్ ఆధ్యక్షులు మన్నెదామో దర్‌రెడ్డిని పలకరించగా క్లబ్ కార్యక్రమాలను వివరించారు. సుందరయ్య పార్కులోనే ఏర్పాటు చేసిన హోమియో క్లినిక్‌లో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రోగులను పరీక్షించి ఉచితంగా మందులు కూడా అందజేస్తారు. ఏడాదిలో 365 రోజులో నాలుగురు డాక్టర్లు పర్యవేక్షణలో క్లినిక్ నిర్వహిస్తుంటారు. ప్రతి నెలా కనీసం 3, 4 ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహించి రోగులను పరీక్షిస్తారు. కేర్, మెడిసిటీ వంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఇందుకు సహకరిస్తున్నాయి. చలికాలం సీజన్‌లో నిరుపేదలకు బ్లాంకెట్లు, పండుగల సందర్భంగా పేదలకు చీరలు, బట్టలు ఈ క్లబ్ ద్వారా పంపిణీ చేస్తారు. జనవరి24, ఆగస్టు15 వంటి జాతీయ పండుగలేకాక, ఉగాది, దసరా, దీపావళి వంటి పండుగలను ప్రజలమధ్యలో ఈ సంస్థ ప్రతినిధులు నిర్వహిస్తుంటారు. ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించి కళ్లజోళ్లు పంపిణీ చేస్తారు. తరచుగా ఆయా అంశాలపై సెమినార్లు నిర్వహించి ఆయారోగాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వేలాది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు సహకరి స్తున్నారు. అంతేగాక విద్యార్థులు, బాలల మానసిక, శారీరక వికాసం కోసం తరచూ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అంద జేస్తున్నారు. 16ఏళ్ల క్రితం 1996లో ఏర్పడిన ఈ క్లబ్‌లో సుమారు 500 మంది శాశ్వత సభ్యులున్నారు. రాష్ట్ర హాండ్లూమ్ టెక్స్‌టైల్, స్మాల్ స్కేల్ ఇండిస్టీస్ మినిస్టర్ ప్రసాద్‌కుమార్ ఈ క్లబ్ సభ్యులే ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన క్లబ్ సభ్యులను ఘనంగా సత్కరించారు. తన స్వార్థం తప్ప సాటి మనిషి గురించి కనీసం ఆలోచించని ప్రస్తుత రోజుల్లో అందరికీ, ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి అనే సమున్నత ఆశయాలతో పని చేస్తున్న వాకర్స్‌క్లబ్ సేవలను అభినందించాల్సిందే.