జయలలితకు బాదల్ ఆహ్వానం

తన ప్రమాణ స్వీకారోత్సవానికి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్‌సింగ్ బాదల్ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను ఆహ్వానించారు. ఈనెల 14న బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మరో పర్యాయం బాధ్యతలు స్వీకరించనున్నారు. చండీగఢ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా జయను బాదల్ ఆహ్వానించారు. అయితే శంకరన్ కోవిల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సివున్నందున ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేనని బాదల్‌కు జయ తెలిపారు. తన తరపున ఎంపీలు మైత్రేయన్, తంబిదురైలను పంపిస్తానని ఆమె చెప్పారు.

తాజావార్తలు ఇతర విశేషాలు

  • ఫైనల్లో ఇంగ్లండ్
  • Publiture