సర్పంచికి షోకాజ్‌ నోటీసు..?

పెనుకొండ సర్పంచి జయలక్ష్మమ్మకు జిల్లా ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసు జారీచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె హాయంలో జరిగిన అవినీతిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. అమెను సర్పంచి పదవి నుంచి సస్పెండ్‌ చేసి స్వాహా నిధులు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మేజర్‌ గ్రామపంచాయతీలో చోటు చేసుకున్న లక్షలాది రూపాయల స్వాహాపై ప్రాథమిక విచారణ జరిపిన సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, డివిజన్‌ పంచాయతీ అధికారి అబ్దుల్‌ హమీద్‌ఖాన్‌ ఇచ్చిన నివేదిక మేరకు కార్యదర్శి సంజీవరెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ మధుసూదన్‌లను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు. సర్పంచికి చెక్‌పవర్‌ రద్దు చేస్తూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న విచారణలో పంచాయతీ నిధులతో పాటు, సాయి కాళేశ్వర్‌ పట్టణాభివృద్ధికి ఇచ్చిన రూ.1.10 కోట్ల రూపాయల నామమాత్రపు పనులు చేపట్టి పెద్ద ఎత్తున నిధులు కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వర్‌ ఇచ్చిన డబ్బులకు టెండర్లు పిలవకనే రూ.50 లక్షల నిధులు సర్పంచి, ఆమె సోదరుడు, పాలక వర్గ సభ్యులు కొందరు పనులు చేపట్టారని అధికారులు గుర్తించారు. ఈ పనులను పర్యవేక్షించిన మండల ఇంజనీర్‌పై కూడా ఆరోపణలు ఉన్న నేపధ్యంలో పర్సంటేజీల రూపంలో లక్షాది రూపాయలు చేతుల మారినట్లు విచారణలో వెలుగుచూస్తున్నాయి. కార్యదర్శి, సర్పంచి, జూనియర్‌ అసిస్టెంట్‌లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నా అపనులు పర్యవేక్షించిన పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌పట్ల ఉన్నతాధి కారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వర్‌ ఇచ్చిన డబ్బులో రూ.10 లక్షలు తన సొంత ఖాతాలో జమచేసుకున్నట్లు, రాష్ట్ర ప్రణాళికా నిధుల్లో రూ.9.70 లక్షలు, ఎస్‌ఎఫ్‌టి నిధులలో రూ.3 లక్షల నిధులతో చేపట్టిన పనుల్లో పంచాయతీ పాలక వర్గం అనుమతి, తీర్మాణం చేయలేదని తెలుస్తోంది. రూ.15.60 లక్షలకు పనులు చేయకనే ముందస్తు పద్దు కింద డబ్బులు డ్రా చేసినట్లు సమాచారం ఈ నిధులు రికవరీ చేయటం, అందుకు బాధ్యలైన సర్పంచి, కార్యదర్శిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్