మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్లఉపాధ్యాయుడుగా పని చేస్తున్న మోహన్‌బాబుకు ఎస్కే యూనివర్సీటీలో డాక్టరేట్ వచ్చినందుకు మంగళవారం ప్రధానోపాధ్యాయులురాలు శశికళ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈసన్మాన సభలో తోటి ఉపాధ్యాయులు డాక్టరేట్ పొందిన మోహన్‌బాబు సేవలను కొనియాడారు. విద్యార్థులకు ఆయన బోధించే విధానాన్ని తోటి ఉపాధ్యాయులకు మండలపరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరిలోను ఆంగ్లంలో పిహెచ్‌డి చేసినది మోహన్ బాబు ఒక్కడేనన్నారు. ఆంగ్ల అనువాదంలో ఆధునిక భారతీయ కాల్పానిక సాహిత్యంపై ఆధ్యయనం చేసి, ఎస్కేయూనివర్సిటీకి పంపినట్లు మోహన్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు యూనివర్సిటీలలో పనిచేసే అధ్యాపకులు సమావేశమై ఇలాంటి వ్యాసరచనలను పరిశీలించి, డాక్టరేట్‌ను ప్రదానం చేస్తారన్నారు. డాక్టరేట్‌పొందడం తమకు చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఉన్నత విద్యవరకు జిల్లాలోనే చదివినట్లు ఆయన తెలిపారు. ఈసన్మానసభలో ఉపాధ్యాయుల సంఘం రమణప్ప, సత్యనారాయణ, బాలాజీ, సుందరయ్య, ముజఫర్, సాయికుమార్, చంద్రశేఖర్, రఘునాథ్, ఉమామహేశ్వర్, వసంతరాణి, అనిల్‌కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.