అనుమానాస్పద స్థితిలో అంగన్‌వాడీ కార్యకర్త మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ అంగన్‌వాడీ కార్యకర్త మృతిచెందిన సంఘటన బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ గోవిందమ్మ(40) సంజీవపురం గ్రామానికి చెందిన నారాయణస్వామితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఈమె సంజీవపురం అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. చెడువ్యసనాలకు బానిసైన గోవిందమ్మ భర్త తరుచూ భార్యను హింసిస్తుండేవాడు. భర్త జులాయిగా తిరుగుతుండటంతో పద్ధతి మార్చుకోవాలని భార్య వారించేది. ఈ క్రమంలో సోమవారం ఉదయం అంగన్‌వాడీ సమావేశం ఉందని ఇంటి నుంచి వెళ్లిన గోవిందమ్మ మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయం వద్ద శవమై కన్పించింది. భర్త ఆమెను హత్య చేశాడని మృతురాలి సోదరులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇటుకలపల్లి సిఐ మునిరామయ్య తెలిపారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్