సందడిలేని 'సంక్రాంతి'

కొత్తచెరువు : కరువు..., బంద్‌లు..., నిత్యావసర ధరల పెరుగుదల తదితర సమస్యలతో నేడు సంక్రాంతి కళ తప్పింది. ఎక్కడా ఆనాటి పండుగ సందడులు ఇప్పుడు కనిపించడం లేదు.గతంలో ఈ పండుగ వచ్చిందంటే మండలంలో ఎక్కడ చూసిన సందడి కనిపించేది. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా నూతన ధాన్యాలతో, గంగెద్దులతో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే వారు. ఇళ్ల ముందు గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులతో అలలారేవి..కొత్తచెరువు పట్టణంలోని ప్రధాన రహదారుల్లోనున్న బట్టల దుకాణాలు, కిరాణా అంగళ్లలో వస్తువులు కొనేందుకు వచ్చే వారితో కిటకిటలాడేవి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితులు మచ్చుకు కూడా కనిపించడం లేదు. రెండు రోజుల్లో పండగ ఉన్నప్పటికీ ప్రధాన రహదారులు బోసిపోయి ఉన్నాయి. గత ఏడాది పంటలేకపోవడం, ఈ ఏడాది వర్షాభావంతో రైతుల పరిస్థితి మరింత దిగజారింది. పంటల భీమా అన్నా ఇస్తే ఊరట కలుగుతుందని రైతులు ఎదురు చూశారు. అది కూడా చేతికి రాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పనులను సైతం అధికారులు కల్పించలేక పోవడంతో చేతిలో కూలీల పరిస్థితి అదే తీరున మారింది.వీటికి తోడు పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యుడి గుండెను గుభేళ్‌ మనిపిస్తున్నాయి. ఏ వస్తువు కొనాలన్న కొనలేని పరిస్థితి నెలకొంది. పండుగ రోజు ప్రత్యేకమైన తీపి వంటకాలు చేసుకో వాలంటే చక్కెర ధర ఆకాశాన్ని అంటుతోంది. కిలో చక్కెర రూ.45 పలుకుతోంది. ఇంత ధర పెట్టి సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. వీటన్నిటి నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సంక్రాంతి సందడి కనిపించడం లేదు.

నార్పల :

అనేది నాటి సామెత. కానీ లేనివారికి పండుగ రోజు కూడా పండుగ దూరం అవుతోంది. పెరిగిన నిత్యావసర ధరలు , సంక్రాంతి పండుగపై ప్రభావం చూపిస్తు న్నాయి. అరుగాలం శ్రమించి పండించిన పంటలు ఇంటికి చేరిన తరుణంలో రైతన్నలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మొదటి రోజు బోగి, రెండోరోజు సంక్రాంతి, మూడోరోజు కనుమ సంబరాలు జరుపుకుంటారు. బోగిరోజు ఉదయం చిన్నారులకు బోగి నీళ్లు పోసి బోగి మంటలు వేస్తారు. సంక్రాంతి రోజు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి పండిన ధాన్యాన్ని పోసి ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తారు. కనుమ రోజున పాడి పశువులను పూజించి వాటి మెడలో గంటలు, హారాలు వేసి వాటి సంబరాన్ని చూస్తారు. ఈ ఏడాది పంటలు చేతికందక, రైతుల అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పండుగ సీజన్‌ వస్తే సరుకుల కొనుగోలు దారులతో దుకాణాలు కిటకిటలాడేవి. ప్రస్తుతం అలాంటి సందడి కనిపించలేదు. పెరిగిన ధరలతో సామాన్యులు కుదేల వుతున్నారు. చౌక దుకాణాల్లో చెక్కెర కూడా పంపిణీ చేయ లేదని పేదలు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో చెక్కెర కిలో రూ.45లు, బెల్లం రూ.43లు, అమ్ముతున్నారు. దీంతో పండుగ రోజు కూడా తమ పిల్లలకు నోరు తీపిచేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపో తున్నారు. నాడు పల్లెల్లో సంక్రాంతి పండుగ అంటే కొత్తబట్టలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలుపాటలతో ఆనం దంతో మునిగితేలుతుండేవారు. నేడు అవి కనుమరు గవుతున్నాయి.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్