అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించండి


  • యూనియన్‌ జిల్లా కార్యదర్శి వనజ

జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని ఆంగన్‌వాడీ వర్కర్స్‌,హెల్పర్ల యూనియన్‌ జిల్లా కార్యదర్శి వనజ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక గణేనాయక్‌ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు చేశామన్నారు. ఈ పోరాటాలకు కేంద్ర ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచేలా జీవోను విడుదల చేసిందన్నారు. జిల్లాలో 17 ప్రాజెక్టులకు గాను 11 ప్రాజెక్టులకు 13 నెలలుగా పెంచిన వేతనాలు ఇవ్వలేదన్నారు. ప్రతి నెలా ఇచ్చే వేతనాలు కూడా మూడు నెలలుగా ఇవ్వలేదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను నిత్యం విజలెన్స్‌ అధికారులు తనీఖీలు చేస్తూ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. వర్కర్స్‌.హెల్పర్లకు ప్రభుత్వం సెల్‌ఫోన్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ కార్డులిస్తామని హామీ ఇచ్చారన్నారు. సెల్‌ఫోన్‌ ఇవ్వకుండా సిమ్‌ మాత్రమే ఇచ్చారన్నారు. వేతనాలు రాకపోవడంతో సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లే పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Publiture