దీక్షలకు గుమస్తాల మద్దతు

పట్టణంలోని ఐబి చౌరస్తాలో కొనసాగుతున్న జెఎసి దీక్షలకు మద్దతుగా గురువారం గుమస్తాలు కూర్చున్నారు. దీక్షల్లో పట్టణ బులియన్‌ మర్చంట్‌ గుమస్తాలు వేముల రాము, దేవరాజ్‌, కామ శ్రీరామ్‌, కండినరేష్‌, గజ్జెల రమేష్‌, కొటారం భీమన్న, వేముల లక్ష్మణ్‌, డి.రాజేశ్వర్‌, తోడ సంతోష్‌, వేల్పుల సతీష్‌, పెండ్యాల సాగర్‌, రాజ్‌కుమార్‌, తాటి వెంకటేశం, రాజా, రాకేష్‌, కుమారస్వామి, వేణు, మాలికుమార్‌, చందు, రాజు, రవి కూర్చున్నారు.

శ్రీరాంపూర్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరుతూ పట్టణ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం 45వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఐసిడిఎస్‌ ఉపాధ్యాయులు, ఆయాలు పద్మావతి, సమ్మక్క, కళావతి, పుష్పలత, సువర్ణ, అరుణ, స్వరూపారాణి, పుల్లక్క, శంకరమ్మ, పవిత్ర, సరస్వతి, శశికళ, కవిత, రాధ, కృష్ణవేణి, సుమలత, తార, చిన్నక్క, మరియా, అనసూర్య, నాగమణమ్మ, జయ కూర్చున్నారు. వీరికి ఎంపిటిసిలు కొయ్యాడ పద్మ, బొడ్డు విమలాచిన్నయ్య, వార్డు సభ్యులు రాజమణి, జెసి కో-కన్వీనర్‌ జనార్ధన్‌రెడ్డి, కలవేణి కుమారస్వామి, జక్కుల రాజేశం, ఏనుగు రవీందర్‌రెడ్డి, సురేందర్‌ రెడ్డి, ముస్కే సమ్మయ్య, పట్టిబక్కులు, దాసు, యువ జెఎసి నాయకులు కారుకూరి నగేష్‌, శ్రీనివాస్‌ సంఘీభావం తెలిపారు.

శ్రీరాంపూర్‌ చేరిన సైకిల్‌ యాత్ర

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోరుతూ చేపడుతున్న ఆందోళనలో భాగంగా విలాస్‌రావు జాదవ్‌ చేపట్టిన సైకిల్‌ యాత్ర గురువారం శ్రీరాంపూర్‌కు చేరుకుంది. సైకిల్‌ యాత్ర చేస్తున్న విలాస్‌రావు జాదవ్‌ను స్థానిక జెఎసి నాయకులు జనార్ధన్‌, రవీందర్‌రెడ్డి, జక్కుల రాజేశం, సురేందర్‌రెడ్డి, కలవేణి శంకర్‌ స్వాగతం పలికారు. పూలమాల వేసి సన్మానించారు. ఈ సందర్భంగా విలాస్‌రావ్‌ జాదవ్‌ మాట్లాడుతూ మార్చి ఒకటిన తన స్వగ్రామం సిర్పూర్‌ (యు) లింగాపూర్‌ గ్రామం నుండి సైకిల్‌యాత్ర ప్రారంభించానని పేర్కొన్నాడు. ఈ యాత్ర బాసర, నిజామాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైద్రాబాద్‌, నల్గొండ, వరంగల్‌, కరీంనగర్‌ మీదుగా శ్రీరాంపూర్‌కు చేరుకున్నానని తెలిపాడు. మొత్తం 1550 కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర చేసినట్లు తెలిపారు. ఈనెల 30న ఆదిలాబాద్‌ నుండి సిర్పూర్‌ వెళ్తానని అన్నారు.

సైద్దాంతిక మాస పత్రిక

ఫీచర్స్

స్పెషల్స్