నిధులు ఖర్చు చేసి పరిష్కరించడంలో పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. పట్టణంలోని బుధవార్‌పేట్(ఎస్‌సికాలనీ) సమస్యలతో సతమతమవుతోంది. వాడలో మురుగు కాల్వలను రెండు నెలలుగా శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నిండి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినా నిర్వహణ లేక కంపు కొడుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షపు నీరంతా ఇళ్లలోకి వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం క్రితం ఈ కాలనీ గుండా జౌళినాలా కాలువకు లింకుగా నిర్మించిన డ్రెయినేజీ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో కాలువ పక్కనున్న కుటుంబాలు డ్రెయినేజీ కంపును భరించలేక పోతున్నాయి. రెండు నెలల క్రితం ఈ కాలనీలో దాదాపు 12మంది డెంగ్యూ వ్యాధిబారిన పడ్డారు. కాలనీ మురికిమయంగా ఉండడంతో విషజ్వరాల బారిన పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం ఇప్పటి వరకు వివిధ పథకాల కింద రూ.15కోట్లకు పైగా నిధులు ఖర్చుచేసి అభివృద్ధి పనులను చేపట్టింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంజూరైన నిధుల్లో 32శాతం నిధులను ఎస్‌సి, ఎస్‌టిల కాలనీల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉంది. ఈ లెక్కన రూ.4.50 కోట్లు ఎస్‌సి కాలనీలకు కేటాయించాల్సి ఉన్నా రూ.2కోట్లకు మించి నిధులు ఖర్చు చేయలేదని దళిత సంఘాల నాయకులు బహిరంగంగానే 43లో
java.lang.NullPointerException