బ్రిటీషు పాలనలో ప్రజల హక్కుల కోసం ప్రాణాలర్పించిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిరస్మరణీయుడని, ఆయన స్ఫూర్తి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు . శుక్రవారం స్థానిక సప్తగిరి కాలనీలో ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి 172వ వర్థంతిని అధికారికరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అ...Read more
కౌలు రైతు చట్టం ప్రకారం వాస్తవ సాగుదారులయిన కౌలు రైతులకు రుణ అర్హత కార్డులివ్వాలచ్చి కావల్సిన సదుపాయాలన్నీ కల్పించాలని ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు కార్మికకర్షక భవన్లో ' వాస్తవ కౌలు దారులైన కౌలు రైతులకే పెట్టుబడి సహాయం అందించాలని రౌండ్ టేబుల్ సమావేశం ఎపి కౌలు రైతు సంఘ జిల్లా అధ్యక్షులు సోమన్న అధ్యక్షతన నిర్వహించారు. జమలయ్య మాట్లాడ...Read more
రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధాన్యాభిషేకం చేసేందుకు తీర్మానం చేయాలని చిప్పగిరి జెడ్పిటిసి మీనాక్షినాయుడు అజెండా లేవనెత్తడంతో ప్రతిపక్ష సభ్యులంతా ఒక్కసారిగా తీవ్ర అభ్యంతరం చెప్పారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర కల్పించకుండా కేవలం ఎన్నికల కోసమే అన్నదాత సుఖీభవ ప్రకటించారని అడ్డుకున్నారు. జెడ్పి చైర్మన్ మల్లెల రాజశేఖర్ కల్పించుకొని ...Read more
వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో అత్యంత సన్నిహితంగా వున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత కుటుంబం వైసిపిని వీడుతున్నట్లు తెలిసింది. వైఎస్ రాజశేఖరరెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ప్రారంభించి నందికొట్కూర్ నియోజికవర్గంలోనే గౌరుచరితకు అనుకూలంగా ముగించడం అనవాయితీ. అలాంటి కుటుంబం ఇప్పుడు వైసిపి నుంచి బయటికి రావడం చర్చనీయాంశమైంది. ఒక సారి ...Read more
కర్నూలు జిల్లాలో 2019 సాధారణ ఎన్నికల్లో ఏయే నియోజికవర్గాల నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై రెండురోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు ముందు పంచాయితీ నడుస్తూనే వుంది. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం అర్ధరాత్రిదాకా జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు సమక్షంలో ఎడతెగని పంచాయితీ ...Read more
సిపిఎం జిల్లా నాయకులు ఎ.రాజశేఖర్, ఏసురత్నం, స్వాములు, నరసింహనాయక్లపై దాడి చేసిన భూకబ్జాదారులు వలి, అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పార్టీ జిల్లా పశ్చిమప్రాంత కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సుదర్శనవర్మ స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఎంకి చెందిన ...Read more
తెలుగు భాషను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి కలెక్టర్ ఎస్ సత్యనారాయణ,జాయింట్ కలెక్టర్ పట్టాన్‌శెట్టి రవి సుభాష్, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతిలు పూలమాలలు వేసి ...Read more