ఈనెల 20న జిల్లా కలెక్టర్ ముట్టడి

Feb 17,2024 16:00 #Kurnool, #VRA
  • ఉద్యోగులు భారీగా తరలి రావాలి
  • ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంగల్రెడ్డి
  • యుటిఎఫ్ నాయకులు మద్దతు

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈనెల 20న తలపెట్టిన చలో కలెక్టరేట్ ముట్టడికి ఉద్యోగులు సిద్ధం కావాలని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంగల్రెడ్డి ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉద్యోగులు ఎదుర్కొంటున్న 19 డిమాండ్లతో కూడిన వినతి పత్రా న్ని ఈనెల 11న చీఫ్ సెక్రటరీ అందజేశామన్నారు చర్చల పేరుతో పిలిచి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కారణంగానే ఈనెల14 నుండి 17వ తేది వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు నిరసన తెలిపారన్నారు. ఆందోళన తీవ్రతరం చేసే దిశగా ఈనెల 20న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి జేఏసీ పిలుపు ఇచ్చిందన్నారు కర్నూల్ లోనే జెడ్పి భవన్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తామన్నారు ఉద్యోగ సంఘాలు ఎవరికి వారే ఉండడం వల్లనే దశాబ్ద కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నామన్నారు తెలంగాణ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు సిపిఎస్ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి జిపిఎస్ ను అమలు చేసి ఉద్యోగుల జీవితాలను అందాకారంలోకి నెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు కింద స్థాయి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన ఐఏఎస్ అధికారులు చోద్యం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనగడ సాధించలేదన్న సత్యాన్ని వైసిపి ప్రభుత్వం గమనించాలన్నారు అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని దాడులు చేస్తూ హత్యలకు కూడా తెగబడుతున్నారని భద్రత కల్పించని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఆస్తులు కొల్లగొట్టడానికే సరిపోయిందని ఉద్యోగుల సమస్యలను గాలికి వదిలేసారు అన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ లోని ఏఎన్ఎం ల పరిస్థితి అధ్వానంగా ఉందని వెంటనే ప్రమోషన్లు కల్పించాలన్నారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసి ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు పెంచాలని కోరారు కార్యక్రమంలో పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు యాసిన్ భాష, ఆదోని ఎన్జీవోస్ నాయకుడు మల్లికార్జున్రెడ్డి, యుటిఎఫ్ నాయకులు సునీల్ రాజ్ కుమార్ ,మల్లికార్జున, ఏపీటీఎఫ్ నాయకులు రఘురామయ్య, అమలనాథన్, ఆర్టీసీ యూనియన్ నాయకులు హరిబాబు, ఆరోగ్య స్వామి, అంజి ,వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు సురేష్ ఏపీ ఎన్జీవోస్ నాయకులు షేకప్ప, ఉషారాణి, బజారి ,నాగేంద్ర, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు మస్తాన్ ఉన్నారు.

➡️