దుబాయి: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో రాణించిన భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, మయాంక్ అగర్వాల్‌లు తమ కెరీర్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఆదివారం విడుదల చేసిన ఐసిసి టెస్టు బౌలర్ల జాబితాలో షమీ ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి దూసుకొచ్చాడు. తన కెరీర్ బెస్ట్ ర్యాంకును నమోదు చేశాడు. షమీ 790 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఫలితంగా భారత్ తరఫున టెస్టు ఫార్మాట్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు నమోదు చేసిన మూడో పేస్ బౌలర్‌గా నిలిచాడు. షమీ కంటే ముందు కపిల్‌దేవ్(877), జస్ప్రీత్ బుమ్రా(832)లు ఉన్నారు. తాజా జాబితాలో బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్ కుమిన్స్ అగ్రస్థానంలో ఉన్నాడు.
మరొకవైపు టెస్టు బ్యాట్స్మెన్ల విభాగంలో 691 పాయింట్లతో మయాంక్ అగర్వాల్ 11వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇది మాయంక్‌కు టెస్టుల్లో బెస్ట్ ర్యాంకు. ఈ జాబితాలో ఆసీస్‌కు చెందిన స్మిత్ టాప్‌లో ఉండగా, విరాట్ కోహ్లి రెండో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన పూజారా, రహానేలు నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో విండీస్‌కు చెందిన హోల్డర్ టాప్‌లో ఉండగా, భారత్‌కు చెందిన రవింద్ర జడేజా రెండు,
రవిచంద్రన్ అశ్విన్ నాలుగు స్థానాల్లో ఉన్నారు.
అలాగే వరుస విజయాలతో దూకుడుగా ఉన్న టీమిండియా.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో 300 పాయింట్లతో ఆధిక్యాన్ని నిలబెట్టకుంది.
షమీ, మయాంక్‌లకు బెస్ట్ ర్యాంకులు
