- ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం
- బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 213
- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మయాంక్ అగర్వాల్
రెండో ఇన్నింగ్స్‌్ లోనూ నాలుగు వికెట్లు కూల్చిన మహ్మద్ షమి(4/31) మూడో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికా షమి (5/35) ఐదు వికెట్లతో కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు.
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 493/6 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేయడంతో శనివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా జట్టు 213 పరుగులకే కుప్పకూలింది. షమికి నాలుగు, అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో టీమిండియాకు అత్యధికంగా ఇన్నింగ్స్ విజయాలను అందించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 10 టెస్టుల్లో భారత్‌కు ఇన్నింగ్స్ విజయాలను అందించి అగ్రస్థానంలో నిలిచాడు.
ఇండోర్: ఐసిసి టెస్టు చాంపియన్‌షిప్ ఆరంభమైన తర్వాత వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆరంభపు టెస్టులో భారీ విజయం నమోదుచేసి శుభారంభం చేసింది. బంగ్లాతో తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. శనివారం బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే ఆలౌట్ చేసి టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లా ఆటగాళ్లలో ముష్ఫికర్ రహీమ్(64) మినహా ఎవరూ రాణించలేదు. శనివారం ఆటలో భాగంగా 493/6 ఓవర్‌నైట్ స్కోరు వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను షాద్మన్ ఇస్లామ్, ఇమ్రుల్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ మోమినుల్ హక్(7), మహ్మద్ మిథున్(18)లు సైతం నిరాశపరచడంతో బంగ్లా తేరుకోలేకపోయింది. లంచ్ విరామ సమయంలోపే బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో ముష్ఫికర్ రహీమ్ భారత బౌలర్లను ప్రతిఘటించడంతో బంగ్లా గాడిలో పడినట్లు కనిపించింది. ఒకవైపు ముష్పికర్ ఆడినా మరొకవైపు బంగ్లాదేశ్ క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ముష్పికర్ రహీమ్ తర్వాత లిటన్ దాస్(35), మెహిదీ హసన్(38)లు మాత్రమే ఓ మోస్తరుగా ఆడారు. రహీమ్ 9వ వికెట్‌గా పెవిలియన్ చేరిన కాసేపటికే బంగ్లా కథ ముగిసింది. బంగ్లా ఆఖరి వికెట్‌గా ఎబాదత్ హుస్సేన్ ఔట్ కావడంతో భారత్‌కు భారీ విజయం దక్కింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు సాధించగా, అశ్విన్ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్‌కు రెండు, ఇషాంత్‌కు వికెట్ లభించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మయాంక్ అగర్వాల్‌కు వరించింది.
మూడోసారి హ్యాట్రిక్..
ఇన్నింగ్స్ విజయాలను వరుసగా మూడుసార్లు సాధించడం భారత క్రికెట్ చరిత్రలో ఇది మూడోసారి. బంగ్లాదేశ్‌తో తాజా టెస్టు మ్యాచ్‌కు ముందు పుణెలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండోటెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రాంచీలో అదే దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోటెస్టులో ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ విజయాన్ని అందుకుంది. దీంతో భారత్ 1992-93 తర్వాత వరుసగా మూడు ఇన్నింగ్స్ విజయాలు సాధించిన రికార్డును సమం చేసింది. అప్పట్లో ఇంగ్లండ్‌పై రెండుసార్లు, జింబాబ్వేపై ఇన్నింగ్స్ విజయాల్ని టీమిండియా నమోదు చేసింది. ఆపై 1993-94 సీజన్లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్ విజయాల్ని టీమిండియా సాధించింది.
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా అత్యధికంగా ఇన్నింగ్స్ విజయాలను అందుకున్న సారథిగా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 10 టెస్టుల్లో ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో ఉండగా... ధోని(9), అజారుద్దీన్(8), గంగూలీ(7) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
స్కోర్‌బోర్డు...
- బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 150 ఆలౌట్
- భారత్ తొలి ఇన్నింగ్స్ 493/6 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: షాద్మన్ (బి) ఇషాంత్ 6, కయాస్ (బి) ఉమేష్ 6, మోమినుల్ హక్ (ఎల్బి) షమి 7, మిథున్ (సి) మయాంక్ (బి) షమి 18, ముష్ఫికర్ రహీమ్ (సి) పుజరా (బి) అశ్విన్ 64, మహ్మదుల్లా (సి) రోహిత్ (బి) షమి 15, లింటన్ దాస్ (సి అండ్ బి) అశ్విన్ 35, మెహిదీ హసన్ (బి) ఉమేష్ 38, తైజుల్ ఇస్లామ్ (సి) సాహా (బి) షమి 6, అబు జాయేద్ (నాటౌట్) 4, ఇబాదత్ (సి) ఉమేష్ (బి) అశ్విన్ 1, అదనం 13. (69.2 ఓవర్లలో) 213 పరుగులకు ఆలౌట్.
వికెట్ల పతనం: 1/10, 2/16, 3/37, 4/44, 5/72, 6/135, 7/194, 8/208, 9/208, 10/213.
బౌలింగ్: ఇషాంత్ 11-3-31-1, ఉమేష్ 14-1-51-2, మహ్మద్ షమి 16-7-31-4, జడేజా 14-2-47-0, అశ్విన్ 14.2-6-42-3
ప్రత్యర్ధి జట్టు చేసిన స్కోర్కంటే ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా ఆరో బ్యాట్స్‌మన్‌గా మయాంక్ అగర్వాల్ రికార్డు నెలకొల్పాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులు మాత్రమే చేసింది. మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ 243 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
- భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు
1. వినూ మన్కడే (231) : న్యూజిలాండ్ (209, 219); 1995-96
2. రాహుల్ ద్రావిడ్(270) : పాకిస్తాన్ (224, 245); 2003-04
3. టెండూల్కర్(248) : బంగ్లాదేశ్ (184, 202); 2004-05
4. విరాట్ కోహ్లీ(213) : శ్రీలంక (205, 166); 2017-18
5. రోహిత్‌శర్మ (212) : దక్షిణాఫ్రికా (162, 133); 2019-18
6. మయాంక్ (243) : బంగ్లాదేశ్ (150, 213); 2019-20