లక్నో: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు 41 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. జజారు(26), జనత్(26), జడ్రాన్(20), నైబ్(24) రాణించగా... విలియమ్స్‌కు మూడు, హోల్డర్, పాల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జనత్(5/11) దెబ్బకు విండీస్ 106 పరుగులకే పరిమితమైంది. రామ్‌దిన్(24నాటౌట్) రాణించినా... మిగతా బ్యాట్స్మన్లు నిరాశపరిచారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు ఒక్కోమ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలవగా... నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఆదివారం జరగనుంది.
రెండో టీ20లో అఫ్గాన్ గెలుపు
