న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)కార్యాలయం సమాచార హక్కు (ఆర్టిఐ) చట్ట పరిధిలోకి వస్తుందంటూ సుప్రీంకోర్టు సంచనల తీర్పునిచ్చింది. పారదర్శకత అనేది న్యాయ స్వేచ్ఛకు భంగకరం కాదని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, జవాబుదారీతనం ి పారదర్శకతను బలోపేతం చేస్తాయని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపక్ గుప్తా, ఎన్వి రమణ, డివై చంద్రచూడ్ నేతృత్వలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే న్యాయమూర్తులు చట్టానికి అతీతులుగా ఉన్నారని కాదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆర్టిఐ కార్యకర్త ఎస్సి అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై 2010లో విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు సిజెఐ కార్యాలయం ఆర్టిఐ పరిధిలోకి వస్తుందంటూ, ఆస్తుల వివరాలు వెల్లడించాలని అత్యున్నత న్యాయస్థానం సెక్రటరీ జనరల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఏప్రిల్ 4న తీర్పు రిజర్వు చేసింది. తాజాగా వెలువరించిన తీర్పులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది.
ఆర్టిఐ పరిధిలోకి సిజెఐ కార్యాలయం
