ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని తీసుకుని రావాలని, కృత్రిమ ఇసుక కొరత, వైసిపి ప్రభుత్వంలో కొనసాగుతున్న భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా గురువారం విజయవాడలోని ధర్నా చౌక్‌లో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు 12 గంటల దీక్ష చేయనున్నారు. దీక్షకు మద్దతుగా అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల మద్దతును ఇప్పటికే టిడిపి నేతలు కోరారు. ధర్నాకు పెద ్దఎత్తున టిడిపి శ్రేణులు, భవన నిర్మాణ కార్మికులు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
నిరూపించకపోతే బాబు పక్కనే దీక్ష : కొలుసు
ఇసుకకొరతపై టిడిపి ఛార్జ్‌షీట్‌లో తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని వైసిపి ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు కుట్రలకు వ్యతిరేకంగా ఆయన పక్కనే గురువారం దీక్ష చేస్తానని హెచ్చరించారు.