హైదరాబాద్ : నిన్న (సోమవారం) కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారమ్‌పై నిలిపి ఉంచిన కర్నూల్ ఇంటర్సిటి ఎక్స్‌ప్రెస్‌ను ఎంఎంటీస్ ట్రైన్ ఢీకొన్న నేపథ్యంలో.. దీనంతటికీ సాంకేతిక లోపాలే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్లాట్పారమ్పై ఓ ట్రైన్ ఉండగా.. మరో ట్రైన్‌కు ఎలా సిగ్నల్ ఇస్తారని అధికారులు స్థానిక సిబ్బందిపై మండిపడ్డారు. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు ప్రయాణీకులు సైతం గాయాలపాలయ్యారు. ఇంకా 10 మంది వరకు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం శుభపరిణామం. కాగా, ఈ ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైల్వే ముగ్గురు సభ్యులతో కూడిన హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. రేపు కాచిగూడ ప్రమాదస్థలిని హైలెవెల్ కమిటీ పరిశీలించనుంది.
కాచిగూడ రైలు ప్రమాదంపై హైలెవెల్ కమిటీ..
