- విద్యాశాఖ మంత్రికి పిడిఎఫ్ ఎమ్మెల్సీల వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఎ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు కెజిబివిలలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ టైం స్కేల్ అమలు చేయాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ను డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎపి సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులను కలుపుకొని మంత్రిని పిడిఎఫ్ శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ కెఎస్ లక్ష్మణరావు సచివాలయంలో గురువారం కలిశారు. కెజిబివిలలో నాన్‌టీచింగ్ ఉద్యోగుల ఔట్సోర్సింగ్ ఏజెన్సీలలో రద్దు చేసి వారిని కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వమే వారికి నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. పిఎబి ప్రకారం వేతనాలు పెంచేందుకు అవకాశం ఉన్నవారికి క్యాడర్ల ప్రకారం వేతనాలు పెంచాలని తెలిపారు. పిఎబి అప్రూవల్ లేని ఉద్యోగులను వారి క్యాడర్‌ను బట్టి రాష్ట్రప్రభుత్వ టైం స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరణిస్తే ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు ఇటీవల రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవోను అమలు చేయాలని కోరారు. సైట్ఇంజనీర్లను ఎఈ, ఎఈఈలుగా పేరు మార్చి పిఎబి చేర్చి ఎఫ్‌టిఎ ఇవ్వాలని తెలిపారు. పార్ట్‌టైం, డైలీవేజేస్, టెంపరరీ అడ్‌హక్ కింద వివిధ కేటగిరిల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియమించి కాంట్రాక్టు ఉద్యోగుల వేతనం ఇవ్వాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల హోదాను జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా మార్పు చేయాలని కోరారు. కెజిబివిలకు ప్రత్యేకంగా వార్డెన్లను నియమించి నైట్ ట్యూటర్స్‌ను నియమించాలని కోరారు. మండల స్థాయిలో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్స్‌కు ఇస్తున్న రూ.1500ల ఇన్సెంటీవ్‌ను ఖాళీగా ఉన్న ఎంఐఎస్ పోస్టులో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేట ర్స్కు ఇచ్చి, జాబ్ చార్టు ఇవ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం బాలకాశి, ఉపాధ్యక్షులు కె విజరు ఉన్నారు.
కజిబివి ఉద్యోగులకూ టైం స్కేల్ వర్తింపు
