- మరో 5 శాతం సుంకాలు పెంచిన అమెరికా
వాషింగ్టన్/బీజింగ్ : చైనా ఎగుమతులపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం మరోమారు సుంకాలు పెంచారు. చైనాకు చెందిన దాదాపు 550 బిలియన్ డాలర్లు విలువైన ఎగుమతులపై 5 శాతం సుంకాలను పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అంతకుముందు అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది.. ఆ ప్రకటన వెలువడిన. కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్ ట్వీట్ చేస్తూ చైనాకు చెందిన ఉత్పత్తులపై సుంకాలు పెంచుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే అంతకుముందు అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సుంకాలు విధిస్తామని తాజాగా చైనా ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ చోటుచేసుకుంది.. అంతకుముందు చైనాలోని అమెరికా కంపెనీలను ఆ దేశం నుండి బయటకు రావలసిందిగా కోరుతూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నదన్న భయాందోళనలు మార్కెట్లను ఆవహించాయి. అంతేకాక అమెరికా స్టాక్ మార్కెట్లలో ప్రధానంగా ఉన్న నస్డాక్ కాంపోజిట్ 3 శాతం, ఎస్అండ్ పి 500 2.6 శాతం తగ్గాయి. ట్రంప్ శుక్రవారం మార్కెట్లు ముగిసిన తరువాత సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో దీని ప్రభావం వచ్చేవారం మార్కెట్లపై పడనున్నాయి. గత ప్రభుత్వాలు చైనా విధానాలను అనుమతించి సమతుల్యతను దెబ్బ తీశాయని, ఇది అమెరికాలోని పన్ను చెల్లింపుదారులకు భారంగా మారిందని ట్రంప్ ట్వీట్ చేశారు. ఒక దేశ అధ్యక్షుడిగా దీనిని తాను ఇకముందు అనుమతించబోనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 25 శాతం సుంకాల పరిధిలో ఉన్న 250 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాన్ని 30 శాతానికి పెంచినట్లు ట్రంప్ తెలిపారు. ఇది అక్టోబరు 1 నుండి అమలులోకి రానున్నది. అదే సమయంలో 10 శాతం పన్ను పరిధిలో ఉన్న మరో 300 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాన్ని 15 శాతానికి పెంచినట్లు చెప్పారు. వాటిల్లో కొన్ని ఉత్పత్తులపై సెప్టెంబరు 1 నుండి సుంకాలు విధిస్తామని, మరికొన్ని ఉత్పత్తులపై కొంత ఆలస్యంగా డిసెంబరు 15 నుండి సుంకాలు విధిస్తామని ట్రంప్ తెలిపారు. ష
చైనాపై వాణిజ్య యుద్ధం తీవ్రతరం
