మాస్కో: ఆధునీకరించిన మిగ్-31బిఎం యుద్ధ విమానాలతో తూర్పున వున్న కంచట్కా ద్వీపకల్పంలో తాము యుద్ధ విన్యాసాలు నిర్వహించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఒక మిగ్ విమా నాన్ని అక్రమ చొరబాటుగా భావిస్తూ మరో మిగ్ విమానం దానిని అటకాయించి తరిమి కొట్టిందని, గగనతలంలో జరిగిన ఈ అద్భుత విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అక్రమంగా చొరబడిన విమానాన్ని గుర్తించిన వెంటనే మరో విమానం ఎలక్ట్రానిక్ విధానంలో ఎయిర్-టు- ఎయిర్ క్షిపణులను ప్రయోగించి చొరబాటును అడ్డుకునే ప్రయత్నం చేసిందని తెలిపింది. ఆధునీకరించిన యుద్ధ విమానాల సామర్ధ్యాన్ని అంచనా వేయటంతో పాటు, ఈ విమానాల నిర్వహణకు అవసరమైన వృత్తి నైపు ణ్యాన్ని పైలట్లకు నేర్పటం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యాలని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో పేర్కొంది.
ఆధునీకరించిన మిగ్లతో రష్యా వైమానిక విన్యాసాలు
