కోల్‌కతా : 'హింసా సంస్కృతిని, అసహనాన్ని' ఖండిస్తూ స్థానిక ప్రముఖులు మరోసారి ఒక లేఖను రాశారు. ప్రముఖ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ కుటుంబానికి బెదిరింపులు రావడంతో ఆయన ట్విటర్ నుండి తప్పుకున్న నేపథ్యంలో వీరు ఈ లేఖను విడుదల చేశారు. ఈ లేఖపై చిత్ర నిర్మాత అపర్ణాసేన్, నటుడు పరంబాత్ర చటో పాధ్యాయ, రంగస్థల నటులు సోహాగ్ సేన్, కౌశిక ్సేన్లతో తదితర 28 మంది ప్రముఖులు సంత కాలు చేశారు. ఈ లేఖను తమ తీవ్రమైన ఆందోళ నకు సంకేతంగా పేర్కొన్నారు. ''భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని'', బహిరంగ వేదికపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు నేడు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న అనేకమందిలో కశ్యప్ కూడా ఒకరని సిటిజన్ స్పీక్ఇండియాకు రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. హింసా సంస్కృతి ద్వారా అన్ని అభిప్రాయాలను, చర్చలను, అసమ్మతిని అణచివేయడంతో పాటు మన దేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని నాశనం చేస్తోం దని వారు తెలిపారు. కాగా, గతంలో మూక దాడ ులను అడ్డుకోవాలని, అటువంటి దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి రాసిన లేఖలో సంతకం చేసిన 60 మందిలో కశ్యప్ కూడా ఉన్నారు. 'మీ తల్లిదం డ్రులకు కాల్స్ వచ్చినపుడు, మీ కుమార్తెకు ఆన్లైన్ లో బెదిరింపులు వచ్చినపుడు ఎవరూ మాట్లాడటా నికి ఇష్టపడరని మీకు తెలుసునని, దానికి ప్రత్యేకంగా కారణాలు అంటూ వుండవని అన్నారు. దుండగులు పరిపాలిస్తున్నపుడు, దుండగుడి ఆదేశాలే శిరోధార్యమవుతాయని అన్నారు. ఈ కొత్త భారతదేశంలో ప్రతి ఒక్కరికి అభినందనలు, మీరందరూ అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నానని కశ్యప్ తన చివరి ట్వీట్లో పేర్కొన్నారు.
హింసా సంస్కృతిని, అసహనాన్ని ఖండిస్తూ మరోసారి లేఖ రాసిన ప్రముఖులు

సంబందిత వార్తలు
-
మహిళకు అందని 'న్యాయం'
-
మతాల మధ్య విభజనకు యత్నం
-
ఎన్ఆర్సిని రాష్ట్రంలో అనుమతించం : మమతా బెనర్జీ
-
పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా బహిరంగ లేఖ
-
స్థంభించిన అసోం
-
జెఎన్‌యు విద్యార్థులపై మళ్లీ లాఠీఛార్జి
-
కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు
-
ముస్లిములే టార్గెట్..!
-
సిపిఎం మూడు సవరణలు
-
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పరిరక్షించుకుంటాం
-
లౌకిక పునాదులను నాశనం చేయడమే : రాహుల్
-
పౌరసత్వ బిల్లుపై రాజుకున్న అగ్గి
-
కార్పొరేట్ల ఊడిగానికే బ్యాంకుల విలీనం
-
కొలీజియం సిఫార్సులపై ఆరు నెలల్లోగా నియామకాలు
-
'ప్రమాదకరమైన మలుపు'లో మత స్వేచ్ఛ
-
అస్సాంలో 289 మంది అరెస్టు : కేంద్రం
-
పార్లమెంటు ఆవరణలో వామపక్షాలు ధర్నా
-
మత విభజనకు బిజెపి కుట్ర
-
పౌరసత్వ మంటలు