* కాకినాడ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి వచ్చిన గవర్నర్
తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ శనివారం కాకినాడ జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. అక్కడి చుట్టుపక్కల వరద పరిస్థితిని జిల్లా అధికారులు గవర్నర్ కు వివరించారు. దీంతో హెలికాప్టర్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఎంత మేరకు నీటి విడుదల జరుగుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందన్న అధికారులు, పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కారణంగా.. 18 మండలాలు నీట మునిగాయని చెప్పారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న గవర్నర్ వరద బాధితులను వెంటనే ఆదుకోవాలనీ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. అనంతరం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ ఏరియల్ సర్వే
