లండన్ : లండన్లోని భారత్ హై కమిషన్ కార్యాలయం ఎదుట వేలాది మంది భారత వ్యతిరేక నిరసన కారులు గురువారం ఆందోళనకు దిగారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తు ప్రణాళికతో వారు ప్రదర్శనలు నిర్వహించడంతో, దానికి ప్రతిగా అక్కడి భారతీయులు కూడా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపధ్యంలో నలుగురు ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు స్కాట్లాండ్ యార్డ్ తెలిపింది. రోజంతా జరిగిన ఈ ఆందోళనలు ఘర్షణ రూపం తీసుకున్నాయి. రాళ్ళు, సీసాలు రువ్విన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనల్లో మెట్రోపాలిటన్ పోలీసు ఒకరికి గాయాలయ్యాయి. విధుల్లో ఉన్న స్కాట్లాండ్ యార్డ్ అధికారులను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ప్రత్యేకించి ఈ ఏడాది కాశ్మీర్ మద్దతుదారులు భారత్ హై కమిషన్ను ముట్టడించారు. ప్రతిఏటా స్వాతంత్య్ర దినోత్సవం నాడు లండన్లో భారత వ్యతిరేత ఆందోళనకారులు భారత దౌత్యకార్యాలయం ఎదుట ఆందోళనకు చేపడుతున్నారు. ఇక్కడి పాకిస్తానీ గ్రూపులు, సిక్కులు, కాశ్మీర్ వేర్పాటువాద సంస్ధలు ఈ ఆందోళనల్లో పాల్గొంటాయి. ఇందులో ఖలిస్తాన్ అనుకూల రిఫరెండం 2020 గ్రూపు కూడా ఉంది.
లండన్లో భారత్ హై కమిషన్ ఎదుట నిరసనలు : నలుగురు అరెస్టు
