తూర్పు గోదావరి : తమిళనాడుకు చెందిన ఏడుగురు గంజాయి స్మగ్లర్లను రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారినుండి 460 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 46 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. గురువారం రావులపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో అమలాపురం డిఎస్పీ రాజాపు రమణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులకు అందిన సమాచారం మేరకు తనిఖీల్లో భాగంగా రావులపాలెం పోలీసులు వీరిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరినుండి గంజాయితో పాటు, రవాణాకి ఉపయోగించిన ఇన్నోవా, మహేంద్రా వాహనాలను,10 సెల్ ఫోన్లు, 38వేల నగదు కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. విశాఖ జిల్లా పాడేరులో పండించిన గంజాయిని తమిళనాడు మీదుగా విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. తమిళనాడు రాష్ట్రం తేనె జిల్లాకు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డిఎస్పీ వివరించారు. మరో ముగ్గురు స్మగ్లర్లు పరారయినట్లు, వారికోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సిఐ వాసిబోయిన కృష్ణ, ఎస్.ఐ. ఎండి నసిరుల్లా లను, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు .
460 కేజీల గంజాయి స్వాధీనం

సంబందిత వార్తలు
-
ఆమె ఏం తింటారు? అవోకాడో (వెన్న పండు) పండు తింటారా? : చిదంబరం
-
కియా ప్లాంట్ను ప్రారంభించిన సిఎం జగన్
-
మద్యం కొనుగోలుపై ఎపి సర్కార్ సంచలన నిర్ణయం..!
-
ఎన్ని కుట్రలు చేసినా...న్యాయమే గెలుస్తుంది : చిదంబరం
-
ఎపిలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదు
-
కాసేపట్లో సిఎం జగన్ ఢిల్లీకి పయనం
-
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా కౌరు శ్రీనివాస్
-
ఇఎస్ఐ స్కాంలో దేవికారాణి భర్తను అరెస్ట్ చేసిన ఎసిబి
-
పార్టీ మారాలనే ఆలోచన నాకు లేదు : గంటా శ్రీనివాసరావు
-
టీమిండియా ఆటగాళ్లను వదలని అబ్దుల్ రజాక్... కెప్టెన్ పై వ్యాఖ్యలు
-
ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం
-
శబరిమలపై అదే చివరి మాట కాదు
-
రాష్ట్రానికి రాజధానే ప్రధాన ఆదాయ వనరు : చంద్రబాబు
-
డిఫరెంట్ కమర్షియల్ ఫిలిం ‘దొంగ’ : రావూరి
-
14న వైజాగ్లో ‘రూలర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
డిసెంబర్ 6న ‘90 ML’ చిత్రం విడుదల
-
''పరారీలో ఉన్న ఆర్థిక నేరస్ధుడు'' గా నీరవ్ మోడీ
-
విజయనగరం చేరుకున్న మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు
-
రిటైర్మెంట్ వయస్సు 60కి తగ్గించం : జితేంద్ర సింగ్
-
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం : బిఎస్పి