ముంబయి నుంచి అమెరికాలోని నెవార్క్ వెళుతున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే లండన్ లోని స్టాన్ స్టెడ్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దింపివేశారు. ఎయిరిండియాకు చెందిన ఏఐ 191 విమానం గాల్లో ఉండగా విమానంలో బాంబులు అమర్చినట్టు బెదిరింపు సమాచారం అందింది. దాంతో బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ టైఫూన్ జెట్ విమానాలు ఎయిరిండియా విమానాన్ని అనుసరించాయి. ఆ విమానాన్ని స్టాన్ స్టెడ్ విమానాశ్రయం దిశగా దారిమళ్లించాయి. ఎయిరిండియా విమానం అత్యవసరంగా దిగిన తర్వాత దాన్ని ప్రత్యేక ప్రదేశానికి తరలించారు. పూర్తిగా తనిఖీలు చేసే సమయంలో రన్ వేపై ఇతర విమానాలను అనుమతించలేదు. విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదన్న విషయం నిర్ధారించాకే విమానాశ్రయం కార్యకలాపాలు పునఃప్రారంభించారు.
ఎయిరిండియాకు బాంబు బెదిరింపు...

సంబందిత వార్తలు
-
నౌ రెస్ట్ ఇన్ పీస్ దిశ!: ఎన్టీఆర్
-
ఎన్ కౌంటర్ స్థలిలో చెల్లాచెదరుగా మృతదేహాలు
-
విజయవాడలోని R-900 వస్త్ర దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
-
ఆత్మహత్యాయత్నం చేసిన ప్రియురాలు... ఐసీయూలో తాళి కట్టిన ప్రియుడు
-
తాడేపల్లిగూడెం లో ఘనంగా సిఐటియు 11 వ జిల్లా మహాసభలు
-
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు విజయనగరంలో ఘన నివాళి
-
ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోతాయా? : షట్లర్ గుత్తా జ్వాలా
-
నేరానికి మరో నేరం పరిష్కారం కాదు : ప్రొఫెసర్ హరగోపాల్
-
దిశ నిందితుల ఎన్కౌంటర్ పై ఎమ్మెల్యే రోజా స్పందన
-
ఇలాంటి కేసుల్లో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి: పవన్ కల్యాణ్
-
ఎన్కౌంటర్ స్థలంలో 12 బుల్లెట్లు రికవరీ
-
సిఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు మృతి
-
నా బిడ్డ విషయంలో ఎందుకు న్యాయం జరగడంలేదు : అయేషా మీరా తల్లి
-
15 నిమిషాల్లో ఎన్కౌంటర్ : సిపి సజ్జనార్
-
పెనుమంట్రలో అంబేద్కర్ 63వ వర్థంతి
-
దిశ నిందితుల ఎన్కౌంటర్పై మలికిపురం విద్యార్ధినుల హర్షం
-
అంబేద్కర్ కు ప్రత్తిపాడులో న్యాయమూర్తుల నివాళి
-
బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి: సీపీఐఎంఎల్ లిబరేషన్
-
అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలి : మహిళా సంఘాలు
-
రేపిస్టులపై దయ చూపాల్సిన అవసరం లేదు : రాష్ట్రపతి