రోమ్: ఐరాసకు చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) సారధిగా చైనా వ్యవసాయ, గ్రామీణాభివృధ్ధి శాఖ ఉప మంత్రి కు డోంగ్యు ఎన్నికయ్యారు. ఎఫ్ఎఓ ఏర్పడిన 70 ఏళ్ల తరువాత ఆ సంస్థ సారధిగా ఒక చైనా నేత ఎన్నిక కావటం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్న ఎఫ్ఎఓ 41వ వార్షిక సదస్సుకు హాజరైన 194 దేశాల ప్రతినిధులు చైనా నేత కు డోంగ్యును తమ సారధిగా ఎన్నుకున్నారు. మొత్తం పోలయిన 191 ఓట్లలో కు కు 108 ఓట్లు లభించాయి. ఎన్నికకు అవసరమైన మెజార్టీ ఓట్లను ఆయన తొలి రౌండ్లోనే సాధించటంలో ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఆయనపై ఫ్రెంచ్ ఆగ్రానమిస్ట్ కాతరిన్ గెల్షియన లాన్లీ, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జార్జి మాజీ వ్యవసాయ మంత్రి డేవిడ్ కిర్వాలిడ్జ్ పోటీ పడ్డారు. తాను ప్రజలు, రైతుల ప్రయోజనాల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని కు చెప్పారు. తాను సంస్థ సభ్యులందరి సమక్షంలోనే బాధ్యతలు స్వీకరిస్తానని, నిబంధనలకు అనుగుణంగా స్వేచ్ఛ, పారదర్శకత, న్యాయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ నిష్పాక్షికంగా, తటస్థంగా బాధ్యతలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ కు డోంగ్యు ఆగస్టు 1న పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రస్తుతం ఈ సంస్థకు బ్రెజిల్‌కు చెందిన జోస్ గ్రజియానో డిసిల్వా నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 2011 నుండి రెండుసార్లు ఈ పదవికి ఎన్నికైన ఆయన పదవీకాలం జులై 31తో ముగియనున్నది. కొత్తగా ఎన్నికైన కు ఈ పదవిలో 2023 జులై 31 వరకూ కొనసాగుతారు. తన వారసుడిగా ఎన్నికైన కు డోంగ్యుకు డిసిల్వా అభినందనలు తెలియచేశారు.
ఎఫ్ఎఓ సారధిగా చైనా

సంబందిత వార్తలు
-
గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
-
మతిస్థిమితం లేని మైనర్‌పై బంధువు అత్యాచారం
-
చంద్రబాబు అబద్ధాలు చెప్పడం సరికాదు : సిఎం జగన్
-
చెన్నైలో ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
-
ఘోర రోడ్డు ప్రమాదంలో..ఆరుగురు దుర్మరణం
-
అయోధ్యపై రివ్యూ పిటిషన్లు కొట్టివేత : సుప్రీం కోర్టు
-
తెలంగాణలో రేపటి నుంచి మీ-సేవ కేంద్రాలు బంద్
-
నీటి కుంటలో మహిళ మృతదేహం లభ్యం
-
స్థానిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కి వినతి
-
పాక్ వాయుసేనపై అమెరికా ఆగ్రహం
-
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఓటేసిన ఎంఎస్ ధోని
-
ఇజ్రాయిల్ పార్లమెంట్ రద్దు, ఏడాదిలో మూడో ఎన్నికలు
-
జార్ఖండ్‌లో ప్రశాంతంగా 'మూడో దశ'
-
అన్నదాత కన్నీరు ఆగే వరకూ పోరాటం ఆగదు : పవన్ కల్యాణ్
-
యానాంలో ప్రేమజంట ఆత్మహత్య
-
శంషాబాద్‌లో రూ.6 కోట్ల బంగారం పట్టివేత
-
నాలుగు నెలలుగా వేతనం తీసుకోని సిద్ధు
-
ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి పెదిరెడ్డి
-
ముఖ్యమంత్రిది ఉన్మాదం : టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు
-
మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఐజి రాజీనామా