సౌథాంప్టన్ : ప్రపంచకప్‌లో భారత్ జైత్ర యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నిలో ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగు విజయాలు సాధించింది. న్యూజి లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. కాగా, శనివారం ఆఫ్ఘనిస్తాన్పై విజయంతో భారత్ ప్రపంచకప్ ల టోర్నీల్లో 50 విజయాలు సాధించింది. ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. ప్రపంచకప్‌ల్లో ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా 67, న్యూజిలాండ్ 53 విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ పై విజయంతో భారత్ ప్రపంచకప్‌లో మరోక రికార్డు కూడా నెలకొల్పింది. లీగ్ దశల్ల్లో అత్యధిక వరుస విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా అవతరించింది. 2011 ప్రపంచకప్‌లో నాగ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికా తో తలపడిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. అయితే అప్పటినుంచి శనివారం మ్యాచ్ వరకు వరుసగా 11 లీగ్ మ్యాచ్‌లు గెలిచింది. గతంలో ఆస్ట్రేలియా పేరిట 1999 ప్రపంచకప్ నుంచి 13 లీగ్ మ్యాచ్‌లు వరుసగా గెలిచిన రికార్డు ఉంది. అదేవిధంగా శనివారం మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ప్రపంచకప్‌ల్లో భారత్‌కు అత్యల్ప సాధించిన విజయం ఇదే. 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటి వరకూ అత్యల్ప విజయం ఇదే.