న్యూఢిల్లీ: ఈ నెల 11వ తేదీన అసోంలోని ఓ వాయుసేన ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ తీసుకుని, నిమిషాల వ్యవధిలోనే కూలిపోయిన ఏఎన్ -32 విమానంలో ప్రయాణించిన వారిలో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగతా ఏడుగురి శరీర భాగాలు లభ్యమయ్యాయని తెలిపారు. సముద్ర మట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో వీరి శరీర భాగాలు చల్లాచెదరుగా పడివున్నాయని అధికారులు తెలిపారు. రష్యాలో తయారైన ఈ టర్బోప్రాప్ ట్రాన్స్ పోర్ట్ విమానం, అసోంలోని జోర్హాట్ నుంచి మేచుకాకు బయలుదేరి కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల తరువాత విమానంలోని అందరూ మరణించారని అధికారిక ప్రకటన వెలువడింది. జోర్హాట్ లోని ఎయిర్ బేస్ కు మృతదేహాలు, శరీర భాగాలను చేర్చామని, వాటిని బంధువులకు అప్పగించనున్నామని ఓ అధికారి తెలిపారు. విమానంలోని సీవీఆర్ (కాక్ పీట్ వాయిస్ రికార్డర్), బ్లాక్ బాక్స్ లను గతవారంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో విమానం కూలిన కారణంగానే, విమానాన్ని గుర్తించడంలోనూ, మృతదేహాలను వెలికి తేవడంలోనూ ఆలస్యం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.
ఏఎన్-32 క్రాష్: ఆరుగురి మృతదేహాలు, ఏడుగురి శరీర భాగాలు లభ్యం

సంబందిత వార్తలు
-
ఏపీ దిశ తరహాలోనే దేశమంతటా ఈ చట్టం తీసుకురావాలి: బాలల హక్కుల సమితి
-
చెన్నైలో ముగిసిన గొల్లపూడి అంత్యక్రియలు
-
210 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్ : పంత్ (71) ఔట్
-
ఎమ్మెల్యేపై అభ్యంతరకరపోస్టులు పెట్టిన ఇద్దరి అరెస్టు
-
ఏపీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసిన టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా
-
రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి
-
విండీస్ టార్గెట్ 288 పరుగులు
-
11పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్ : అంబ్రీస్ (9) ఔట్
-
స్వాతి మాలివాల్ ను ఆస్పత్రికి తరలింపు
-
నెహ్రూపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిందంటూ బాలీవుడ్ నటి అరెస్ట్
-
హీరో బషీద్ అరెస్ట్
-
హెట్మెయిర్ హాఫ్ సెంచరీ
-
అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు రద్దు : చైనా
-
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం..ముగ్గురు మృతి
-
రణరంగంగా మారిన ఢిల్లీ
-
వాతావరణ మార్పు చర్చల్లో పురోగతి
-
లెబనాన్లో ఘర్షణలు
-
'ఉగ్ర కుట్ర' బహిర్గతం చేసిన కమ్యూనికేషన్ మంత్రి జార్జ్ రోడ్రిగేజ్
-
229 పరుగుల వద్ద రెండో వికెట్ డౌన్: హెట్మెయిర్ (139) ఔట్
-
ఉన్నావ్ అత్యాచారం కేసులో నేడు తుది తీర్పు!