- భూమండలంపై మూడు,నాలుగు స్థానాలు
న్యూయార్క్ : గత కొన్నేళ్లుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భూమండలం మొత్తం అగ్నిగోళంగా మారిపోతుండగా అత్యధిక ఉష్ణోగ్రతలతో మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన కువైట్, పాకిస్తాన్లు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కువైట్లోని మిట్రిబాలో 2016 జులై 21న 59 డిగ్రీలసెల్షియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, పాకిస్తాన్లోని తర్బత్లో 2017 మే 28న 53.7 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఈ సంస్థ వివరించింది. ఈరెండు ప్రదేశాలనూ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన మూడు, నాలుగు ప్రదేశాలుగా గుర్తించినట్లు తెలిపింది. 76 ఏళ్లకాలంలో అధికారికంగా నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలివే కావటం విశేషం.
నిప్పుల కుంపట్లుగా కువైట్, పాకిస్తాన్
