- వివాదాస్పద బిల్లుకు క్యూబెక్ అసెంబ్లీ ఆమోదం
అట్టావా : ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదుల వంటి వారు మతపరమైన చిహ్నాలను ధరించటాన్ని నిషేధించే వివాదాస్పద బిల్లుకు కెనడాలోని క్యూబెక్ ప్రావిన్షియల్ ప్రభుత్వం ఆమోదముద్ర వేయటం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఫ్రాంకోఫోన్ ప్రాంతంలో వున్న క్యూబెక్ ప్రావిన్షియల్ ప్రభుత్వం తన ఉనికిని చాటుకునేందుకే ఈ బిల్లును ఆమలులోకి తెచ్చిందని విమర్శకులు విమర్శిస్తున్నారు. ఈ బిల్లు ప్రకారం క్రైస్తవులు శిలువలను, ముస్లింలు బుర్ఖాలు, హెడ్స్కార్ప్లను, సిక్కులు టర్బన్లను, యూదులు యార్ముల్క్ల వంటి వాటిని ధరించటాన్ని నేరంగా పరిగణిస్తారు. ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాలు కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తున్నప్పటికీ భద్రత, గుర్తింపు వంటి అంశాల కోసం ముఖాలను కన్పించేలా వుంచుకోవాలని నిబంధన విధించారు.
దీనితో పాటు క్యూబెక్ ఉనికిని కాపాడుకునే లక్ష్యంతో తమ ప్రాంతానికి వచ్చే వలసవాసులకు ఫ్రెంచ్ భాష, విలువల పరీక్షలను నిర్వహించాలని నిర్దేశించే బిల్లుకు కూడా క్యూబెక్ ప్రావిన్షియల్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. అయితే లౌకిక విధానాలు అనుసరించే కెనడా వంటి దేశంలో ఇటువంటి చట్టాలకు చోటు వుండబోదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. సిక్కు టర్బన్లు, ముస్లిం బుర్ఖాలు, యూదుల యార్ముల్క్ల వంటివి పశ్చిమ దేశాల సంస్కృతికి భిన్నమైనవని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ మతచిహ్నాల ధారణపై నిషేధం ఒక 'అబ్సర్డ్' అని వారు కొట్టిపారేస్తున్నారు.
సంస్కృతి పరిరక్షణ పేరుతో ఫాసిస్టు చట్టం...!
