- ఇసికి ఆమంచి వ్యక్తిగత అడ్వకేట్ల ఫిర్యాదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అతని అనుచరుల పట్ల చీరాల పోలీసు అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమంచి వ్యక్తిగత అడ్వకేట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల్‌కృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. వెలగపూడి సచివాలయంలోని ఇసి కార్యాలయంలో బుధవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అడ్వకేటు తులసీరామ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపి నుండి వైసిపిలోకి మారిన రోజు నుండి ఆయనపై టిడిపి నేతలు పరోక్షంగా పోలీసులతో ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమంచి కుటుంబసభ్యులు, అనుచరులపై నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించి జైళ్లలో పెడుతున్నారని తెలిపారు.
పట్టాభిపురం ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి
- ఇసికి వైసిపి నేతల ఫిర్యాదు
టిడిపి నేతలకు కొమ్ముకాస్తున్న ఎస్ఐ తీరును ప్రశ్నించినందుకు పట్టాభిపురం ఎస్ఐ తనపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారని, తక్షణమే ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమనియోజకవర్గ వైపిపి నేత కొత్త చిన్నపురెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్వామి సినిమాహాలు సమీపంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో టిడిపికి చెందిన ఓ కారులో భారీ మొత్తంలో మద్యం, డబ్బులున్నా పోలీసులు ఆ కారును వదిలిపెట్టారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
ఓటర్లను చైతన్యవంతం చేయడానికి సహకరించాలి
- ద్వివేదికి చలసాని శ్రీనివాస్ వినతి
రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై ఓటర్లను చైతన్యవంతం చేయడానికి సహకరించాలంటూ ఎపి విభజన హక్కుల పోరాట సమితి, మేథావుల హక్కుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణద్వివేదిని కోరారు. ఓటర్లు తమ ఓటుహక్కును మద్యం, డబ్బు ప్రలోభానికి లోనై దుర్వినియోగం చేసుకోకూడదని చైతన్యవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని శ్రీనివాస్ ఇసికి వివరించారు.
చీరాల పోలీసు అధికారుల తీరుపై చర్యలు తీసుకోవాలి
