ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
తెలంగాణలో జనసేన పార్లమెంటరీ కమిటీల ఏర్పాటులో భాగంగా ఆ పార్టీ అధ్యక్షులు మెదక్, నల్గొండ, భువనగిరి, వరంగల్ నియోజకవర్గాలకు ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ కమిటీలను ప్రకటించారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కమిటీల నియామకంపై ఆదివారం చర్చలు జరిగాయి. అనంతరం నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎగ్జిక్యూటీవ్, వర్కింగ్ కమిటీలను నియమిస్తూ నిర్ణయం తీసుకుని వివరాలు వెల్లడించారు. ఇప్పటికే సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఖమ్మం నియోజకవర్గాలకు కమిటీలను ఏర్పాటు చేశారు.
నాలుగు పార్లమెంటరీ కమిటీలను ప్రకటించిన జనసేన
