రాజ్‌కోట్ : వేసవి కాలం రావడానికి మరికొంత సమయమున్నప్పటికీ నీటి వనరులు అంతగా లేని గుజరాత్లో పశు శిబిరాల ఏర్పాటు వేగంగా జరుగుతున్నది. ప్రత్యేకించి. దుర్భిక్ష కచ్ జిల్లాలో ఇప్పటికే 172 పశు శిబిరాలను స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేశాయి. ఈ శిబిరాలను స్థానికంగా ధోర్వాడాలని పిలుస్తారు. దాదాపు లక్షకు పైగా పశువులకు రక్షణ కల్పించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. కాగా ప్రభుత్వం మరో 119 గోశాలల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందచేస్తోంది. జిల్లాలో ఏర్పాటు చేసే గోశాలల్లో కూడా లక్షకు పైగా పశువుల సంరక్షణకు వీలు కలుగుతుంది. ఇటీవల కాలంలో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లా అధికారులు చెప్పిన వివరాల మేరకు ఈ పశు శిబిరాలలో లక్షా 8 వేల 442 పశువులు ఆశ్రయం పొందనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 119 గోశాలల్లో 1,04,215 పశువులు తలదాచుకుంటాయని అధికారులు తెలిపారు. వేసవి గడుస్తున్న కొద్దీ శిబిరాల సంఖ్య 250కి పెరగవచ్చునని కచ్ డిప్యూటి కలెక్టర్ నియాజ్ పఠాన్ తెలిపారు. జిల్లాలోని 10 తాలూకాలను దుర్భిక్ష ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది . ఈ ప్రాంతాలలో గత వర్షాకాలంలో 25 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యింది.
కచ్‌లో పశువుల శిబిరాల ఏర్పాటు

సంబందిత వార్తలు
-
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయము: రజనీకాంత్
-
పార్టీ మార్పుపై వచ్చిన ఊహాగానాలకు గంటా క్లారిటీ
-
జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూ
-
రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి
-
విమానంకు తప్పిన ప్రమాదం
-
వివాహిత మృతి.. భర్తపైనే అనుమానం
-
అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు : ఐద్వా డిమాండ్
-
ఐదేళ్లలో బిసిలకు రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం : వైఎస్ జగన్
-
టిటిడి బోర్డు సభ్యులుగా మరో ఇద్దరికి అవకాశం
-
ఒకే కాన్పులో ఏడుగురు జననం
-
ఘనంగా ఆసియా విజన్ అవార్డుల వేడుక
-
వరల్డ్ కప్‌లో భారత్..పాక్‌తో ఆడకూడదు : సిసిఐ
-
జనసేన అభ్యర్థిత్వం కోసం..ఆలుమగల దరఖాస్తులు
-
అమర జవాన్ల కుటుంబాలకు బిసిసిఐ విరాళం రూ.5 కోట్లు!
-
కొండవీడుకోట ఉత్సవాలు ప్రారంభం
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు : 10 మంది మావోయిస్టులకు గాయాలు
-
వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి
-
పాక్‌లో ఆత్మాహుతి దాడి : 9మంది సైనికులు మృతి
-
లారీ ఢీకొని ముగ్గురు యువకులు మృతి
-
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం