ముంబయి : ఐసిస్ ఉగ్రవాద బృందాలతో సంబంధాలున్నాయనే అనుమానంపై ఒక టీనేజర్‌తో సహా 9 మందిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) మంళవారం అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని ముంబ్రా, థానే, ఔరంగబాద్ల నుండి వారిని అరెస్టు చేసినట్లు తెలిపింది. శనివారం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్న తరుణంలో రాష్ట్రంలో స్లీపర్ సెల్స్ ఉనికిపై మహారాష్ట్ర ఎటిఎస్ బృందాలు జరిపిన దర్యాప్తులో భాగంగా వారిని అరెస్టు చేశారు. అరెస్టయిన తొమ్మిది మంది గురించి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు కొన్ని వారాలుగా వారిపై ఎటిఎస్ నిఘా ఉంచింది. ఆ తొమ్మిది మంది బృందం దాడులకు సిద్ధమవుతున్న్న సమయంలో ఎటిఎస్ సిబ్బంది గత రాత్రి పలు బృందాలుగా చీలిపోయి ముంబ్ర, థానే, ఔరంగబాద్లలో వివిధ ప్రాంతాలలో ఒకేసారి సోదాలు జరిపారు. ఈ సోదాలలో కొన్ని రసాయనాలు, పేలుడు పదార్థాలు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్స్, సిమ్ కార్డులు, యాసిడ్ బాటిళ్ళు, పదునైన కత్తులను వారు కనుగొన్నారు. అరెస్టు చేసిన వారి పేర్లను దర్యాప్తు అధికారులు వెల్లడించలేదు గాని వారి వయస్సు ఎంత, వారిని ఏ ప్రాంతం నుండి వెల్లడించారనే విషయాన్ని మాత్రం వివరించారు. నేర కుట్ర, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటానికి సంబంధించిన పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
రిపబ్లిక్ డే నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదులనే అనుమానంతో 9 మంది అరెస్టు

సంబందిత వార్తలు
-
ప్రయాణిస్తున్న కారులో మంటలు...ఒకరు సజీవదహనం
-
ఏసిబి వలలో మరో అనినీతి అధికారి
-
పేలుడు పదార్థాలు పట్టివేత
-
వెలుగులోకి వస్తున్న రాకేష్‌రెడ్డి భూదందాలు
-
జైపూర్ సెంట్రల్ జైల్లో పాక్ ఖైదీ హత్య
-
తమిళనాడులో జల్లికట్టు రణరంగం
-
చింతమనేనిని టిడిపి నుంచి సస్పెండ్ చేయాలి : ఎమ్మెల్యే రోజా
-
దళిత సంఘాల ఆధ్వర్యంలో చింతమనేని శవయాత్ర
-
జిఎస్టి మండలి నిర్ణయం 25కు వాయిదా
-
మంచు చరియలు విరిగిపడి ఆరుగురు జవాన్లు మృతి
-
పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ బాధ్యత వహించాలి : సిఎం చంద్రబాబు
-
అపుస్మా ఆధ్వర్యంలో జై జవాన్ ర్యాలీ
-
రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య
-
లండన్ చేరుకున్న జగన్..
-
పవన్ రాయలసీమ పర్యటనలో స్వల్ప మార్పులు..
-
ముగిసిన రేవంత్ రెడ్డి ఈడీ విచారణ
-
బోరు బావిలో పడిన ఆరేళ్ళ బాలుడు
-
బయో డేటాల స్వీకరణకు తుది గడువు : జనసేన
-
28న టిడిపిలో చేరనున్న కోట్ల
-
సామర్లకోటలో పాఠశాల విద్యార్థి కిడ్నాప్