- మరికాసేపట్లో కేటీఆర్, జగన్ భేటీ
- ఎవరెవరు వస్తున్నారన్న విషయమై ఆరా తీస్తున్న కొందరు
- వారితో గొడవకు దిగిన వైకాపా కార్యకర్తలు
మరికాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొందరు పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్, లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లనున్న వేళ, ఏపీ ఇంటెలిజెన్స్ బృందం, జగన్ ఇంటి వద్ద కనిపించడం కలకలం రేపింది. జగన్ ఇంటికి వచ్చి వెళుతున్న వారి వివరాలను ఈ బృందం సేకరిస్తున్నట్టు సమాచారం. ఇక్కడి వివరాలను వారు విజయవాడకు చేరవేస్తున్నారని వైకాపా వర్గాలు ఆరోపించాయి. జగన్ ఇంటి వద్ద కొందరు ఐబీ అధికారులను చూసిన వైకాపా కార్యకర్తలు, వారితో వాగ్వాదానికి దిగారు. వారు తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.