న్యూఢిల్లీ : తీవ్ర స్థాయిలో పెరుగుతున్న పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసనలు, హర్తాళ్‌కు ప్రజల నుంచి భారీ స్థాయిలో మద్దతురావడంపై సిపిఎం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. దేశవ్యాప్తంగా నిరసనలు విజయవంతమైనట్లు నివేదికలు వస్తున్నాయని సిపిఎం ఒక ప్రకటనలో తెలిపింది. కర్నాటక, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర, పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్, పునరావస, సహాయక కార్యక్రమాలు జరుగుతున్న ప్రాంతాలు మినహా కేరళ వంటి రాష్ట్రాల్లోనూ, ఇంకా అనేక ప్రాంతాల్లోనూ అన్ని రకాల వాణిజ్య కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపింది. ఒడిషా, జార్ఘండ్ వంటి రాష్ట్రాల్లోనూ ప్రజలకు వ్యతిరేకంగా ఆర్థిక హింసకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ ప్రజలు తమ రోజువారి పనులను మానుకుని ఈ ఆందోళనలో పాల్గొన్నారని తెలిపింది. వీధుల్లోకి వచ్చి మోడీ ప్రభుత్వా విధానాలపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని సిపిఎం తన ప్రకటనలో పేర్కొంది. రైల్‌రోకో, రాస్తా రోకో, ధర్నా వంటి సామూహిక నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపింది. సమ్మె పిలుపునకు భారీ స్థాయిలో మద్దతు వచ్చిందని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్షాలు నిర్వహించిన ఈ హర్తాళ్‌ను అణిచివేయాలని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా విజయవంతమైయిందని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సిపిఎం, మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను మరింత తీవ్రతరం చేయాలని పిలుపు ఇచ్చింది.
ప్రజలకు సిపిఎం అభినందనలు

సంబందిత వార్తలు
-
మేఘాలయ గవర్నర్‌ను తొలగించాలి
-
సైనికులకు అమరవీరుల హోదా కల్పించలేదు
-
దక్షిణ కొరియాలో మోడీ రెండు రోజుల పర్యటన..
-
కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్‌కు మాజీ సైనికాధికారి నేతృత్వం
-
26న ప్రతిపక్షాలు భేటీ
-
కాశ్మీర్ విద్యార్థులపై దాడులకు స్పందించని మోడీ
-
మేఘాలయలో బిజెపికి 'షాక్'
-
సునందా పుష్కర్ హత్య కేసు మార్చి ఏడుకు వాయిదా
-
ప్రమాదంలో ఇపిఎఫ్ నిధులు
-
ఆదివాసీల రక్షణకు ఆర్డినెన్స్ తీసుకురండి
-
యుపిలో పొత్తు ఖరారు
-
సిపిఎస్‌ను తక్షణమే రద్దు చేయాలి
-
పాక్‌ను 'గ్రే' జాబితాలోనే ఉంచిన ఎఫ్ఎటిఎఫ్
-
పాక్‌లో ఉగ్రవాదులు లేరని చెప్పలేను
-
సింధు నదీ జలాల ఒప్పందాన్ని
-
హెచ్1బి భాగస్వాములకు పని అనుమతి లేనట్లేనా.!
-
ఫోటోషూట్ సర్కార్ : రాహుల్
-
ఇస్రోకు త్వరలో పిఎస్ఎల్విలను అందిస్తాం
-
ఎన్నికల షెడ్యూల్ ముహూర్తం ఖరారు..!
-
యుపిలో ఇద్దరు జైషే ఉగ్రవాదుల అరెస్టు