- సీబీఎస్ఈపై 'సుప్రీం' ఆగ్రహం
న్యూఢిల్లీ : 2016లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఎస్ఈ విద్యా ర్థులు.. పరీక్షలు రాసిన తరువాత సమాధాన పత్రా లను మూల్యాంకనానికి కోరినప్పుడు వారి దగ్గరి నుంచి నగదును వసూలు చేయడాన్ని నిషేధిస్తూ రెండేండ్ల క్రితం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. విద్యార్థుల నుంచి రూ.1,200 ఫీజును సీబీఎస్ఈ వసూలు చేస్తున్నది. మూల్యాంకనం కోరాలను కునే 10, 12వ తరగతి విద్యార్థులు తప్పకుండా ఫీజు కట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దీనిపై దాఖలైన పిటిషన్ను విచారిస్తున్న న్యాయస్థానం.. ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్యార్థులు పరీక్ష పత్రాల మూల్యాంకనం కోరడం వారి ప్రాథమిక హక్కు అని.. డబ్బులు వసూలు చేసి ఆ హక్కులను అడ్డుకోరాదని కోర్టు 2016లో సూచించిన విషయం విదితమే.
కోర్టు ఆదేశాల ఉల్లంఘన..
