సరైన సమయానికి ప్రథమ చికిత్స అందక మన దేశంలో ప్రతి సంవత్సరం డెభై వేల మందికి పైగా చనిపోతున్నారనేది ఒక అంచనా. వీరిలో పాము కాటుతోపాటు హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయిన వారే ఎక్కువ.
- టిఐఎ (ట్రేన్సియంట్ ఎస్కెమిక్ ఎటాక్)ను హార్టెటాక్ రావడానికి నిజమైన హెచ్చరికగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా మొదటి టిఐఎ వచ్చినవారిలో మూడొంతుల మంది ఐదేళ్ళలోపే మెదడు లేదా హార్ట్ స్ట్రోక్‌కు గురవుతున్నారనేది ఒక అధ్యయనం.
- కంటిగాయాల్ని సాధారణంగా చల్లని నీళ్ళతో కడుగుతుంటాం. కానీ కంటికి ఏదైనా గాయం అయితే ముందుగా కంటి గుడ్డును గోరువెచ్చని నీటితో శుభ్రంచేయాలి. ఇలా పది పదిహేను నిమిషాలు శుభ్రం చేశాక గాయంపై కాటన్ పట్టీతో బ్యాండేజ్ వేయాలి.
- శరీరంపై ఏదైనా గాయం అయితే వెంటనే అక్కడ చర్మాన్ని గట్టిగా రుద్దేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా ఆ ప్రాంతానికి రక్తం మరింత వేగంగా ప్రసరించి ఎక్కువ రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. గాయం అయిన వెంటనే చర్మాన్ని రుద్దకుండా ఆ ప్రాంతంలో ఐస్ ముక్కతో మర్దనా చేయడం ద్వారా ఉపశమనం ఉంటుంది.
- కొంతమందికి తరచుగా ముక్కు నుంచి రక్తంకారడాన్ని గమనిస్తుంటాం. శ్లేష్మ పొరల్లోని చిన్న చిన్న రక్తనాళాలకు గాయం కారణంగా ఇలా ముక్కు నుంచి రక్తం కారుతుంది. అయితే రక్త స్రావం అయ్యే సమయంలో ఎక్కువమంది తలను వెనక్కు వంచడం, తల వెనక్కు వాల్చి పడుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా తలపై రక్తపోటు పెరగడంతోపాటు రక్తస్రావం మరింత ఎక్కువవుతుంది. దీనికి చేయాల్సింది ముందుగా నాసికా రంధ్రాల్ని చూపుడు, బొటనవేలుతో పది నిమిషాల పాటు మూసి ఉంచాలి. అప్పుడు నోటి ద్వారా గాలిని తీసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా ముక్కు నుంచి రక్త స్రావం తగ్గుతుంది.
- యుకెలో ప్రథమ చికిత్స అందక ఈ ఏడాది అక్కడ దాదాపు లక్ష నలభైవేల మంది చనిపోయారనేది ఒక నివేదిక.
- ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మంది చిన్నారుల్లో నలుగురు మాత్రమే ఫస్ట్ ఎయిడ్ గురించి తెలిసిన వారున్నారనేది ఒక అంచనా.
- ప్రపంచవాప్తంగా విమాన ప్రయాణీకుల్లో ఎక్కువగా శ్వాస సంబంధిత కారణాలతో చనిపోతున్నారనేది ఒక అధ్యయనం.
- పాము కాటు సందర్భాల్లో ఎక్కువగా ఆ విషాన్ని మరొకరు తేసేసేందుకు ప్రయత్నిస్తుంటారు. లేదా కాటు వేసినచోట చర్మాన్ని తొలగించడం లేదా ఏదైనా పసరు, లేపనాల్ని చొప్పించడం చేస్తుంటారు. నిజానికి ఇలాంటివన్నీ సరైనవికావు. పాము కాటు ఉన్న చోట గట్టిగా ఎలాంటి కట్లనూ వేయకూడదు.
- అత్యవసర పరిస్థితుల్లో వైద్యుని వద్దకు చేరుకునే ముందే ప్రథóమ చికిత్స ద్వారా రోగి లేదా గాయపడిన వారి ప్రాణాల్ని కాపాడుకోవచ్చు.
- ప్రాథమిక చికిత్సపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ శాతం ప్రమాదాల్ని నివారించవచ్చనేది ఒక నివేదిక.
తొలి చికిత్స
