అమరావతి : ఇవాళ మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఏర్పేడులో లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అనంతరం అక్కడ ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లడంతో 20 మంది అక్కడికక్కడే మృతి చెందగా....ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈనేపధ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులైన నారాయణ, అమర్నాథ్ రెడ్డిలను ఘటనా స్ధలానికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రులు నారాయణ , అమర్నాథ్రెడ్డిలు చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనా స్ధలానికి బయలుదేరారు.
ప్రమాద స్ధలానికి వెళ్లాలని మంత్రులకు చంద్రబాబు ఆదేశాలు...
