వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆ దేశ నేర పరిశోధన సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎప్‌బిఐ) గట్టి షాక్ ఇచ్చింది. రష్యాతో ట్రంప్‌కు ఉన్న సంబంధాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఎఫ్బిఐ నిర్ణయించింది. ఎఫ్బిఐ డైరక్టర్ జేమ్స్ కామీ ఈ విషయాన్ని సోమవారం ధృవీకరించారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఒక వ్యూహాం ప్రకారం రష్యా జోక్యం చేసుకుందని, ట్రంప్ గెలుపునకు కృషి చేసిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ దీనిని తోసిపుచ్చారు. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలు ఆ వార్తలను బలపరిచేలా ఉండటంతో అధ్యక్షుడితో రష్యా సంబంధాలు, ఎన్నికల్లో జోక్యం అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఎప్‌బిఐ నిర్ణయించింది. 'అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై సమగ్ర జరపాలని నిర్ణయించాం. దీనిలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు, ఆయన సన్నిహితులకు రష్యాతో ఉన్న సంబంధాలపై దృష్టి సారిస్తున్నాం' అని జేమ్స్ కామీ చెప్పారు. సాధారణంగా ఎఫ్బిఐ ఏఏ అంశాలపై దర్యాప్తు చేస్తోందన్న అంశాలను గోప్యంగా ఉంచుతారు. కొన్ని సమయాల్లో బయటకు పొక్కకుండా గట్టి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే, తాజా దర్యాప్తు విషయంలో దానికి భిన్నంగా వ్యవహరించాలని న్యాయశాఖ నిర్ణయించింది. . ' ఇది అత్యంత ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశం, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీనిని వెల్లడా చేయాలని నిర్ణయించాం. న్యాయశాఖ ఆ అధికారాలను నాకు ఇచ్చింది' అని ఒక ప్రశ్నకు జవాబుగా ఎఫ్బిఐ డైరక్టర్ జేమ్స్ కామీ చెప్పారు. 'ఇది చాలా కష్టమైన పని. దర్యాప్తు ఎంత కాలానికి పూర్తవుతుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం.' అని ఆయన చెప్పారు.
ట్రంప్‌పై ఎఫ్బిఐ విచారణ

సంబందిత వార్తలు
-
ఈజిప్ట్ ఫోటో జర్నలిస్టుకు యునెస్కో పురస్కారం
-
దక్షిణ డెమాస్కస్ పోరులో ఐఎస్‌పై పట్టుబిగించిన సిరియా
-
పరాగ్వే అధ్యక్షుడిగా అబ్డో బెనిటెజ్ ఎన్నిక
-
వాణిజ్య చర్చలకు ట్రంప్ ప్రత్యేక దూత
-
షాంఘై సహకార సంస్థ అభివృద్ధికే ప్రాధాన్యత
-
భారత్ - చైనా సంబంధాలకు కొత్త ఊపు
-
హింసకు వ్యతిరేకంగా సంఘటితమైన నికరాగ్వా ప్రజలు
-
టొరంటో ట్రక్కుదాడిలో 10కి చేరిన మృతుల సంఖ్య
-
క్యూబాలో మొరేల్స్ కానెల్‌తో పలు అంశాలపై మొరేల్స్ చర్చలు
-
నిరసనల నేపథ్యంలో వైదొలగిన ఆర్మేనియా ప్రధాని
-
ద.కొరియాపై అమెరికా ఒత్తిడి
-
'హెచ్-1బి' జీవితభాగస్వాములకు ట్రంప్ సర్కారు షాక్
-
కొత్తగా మరో అణు ఒప్పందం
-
అంతర్యుద్ధంతో పూర్తిగా ఛిద్రమైన యెమెన్
-
చర్చల వైఫల్యంతో మళ్లీ రోడ్డెక్కిన అర్మీనియన్లు
-
భగ్గుమన్న చమురు బావి
-
కనీస వేతన విధానాన్ని రద్దు చేయండి