మామిడి బొప్పాయి మిల్క్ షేక్
కావాల్సిన పదార్థాలు
పండిన బొప్పాయి ముక్కలు -1 కప్పు
మామిడి గుజ్జు- 1 కప్పు
సోయా పాలు - 1 కప్పు
తయారుచేసే విధానం
ముందుగా బొప్పాయి, మామిడి పండ్లను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
గింజలు లేకుండా ఈ ముక్కల్ని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. గుజ్జులా మారిన ఈ మిశ్రమంలో కొద్దిగా సోయా పాలను పోసి మరోసారి బ్లెండ్ చేయాలి. తర్వాత జ్యూస్‌ని ఒక కంటెయినర్లోకి తీసి గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బైటికి తీసి చల్ల చల్లని మామిడి బొప్పాయ మిల్క్‌షేక్‌ని సర్వింగ్ గ్లాసుల్లో పోసి అతిథులకు అందించండి.
పుచ్చకాయ మిల్క్‌షేక్
కావాల్సిన పదార్థాలు
పాలు -1 కప్పు
పుచ్చకాయ ముక్కలు -1 కప్పు
క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
పంచదార - 1 టేబుల్ స్పూన్
ఐస్ ముక్కలు -1 కప్పు
తయారుచేసే విధానం
ముందుగా పుచ్చకాయపై చెక్కు తీసి గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి ఒకసారి బ్లెండ్ చేయాలి. తర్వాత క్రీమ్, పాలు, పంచదార, ఐస్ ముక్కలు వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. రుచికరమైన పుచ్చకాయ మిల్క్‌షేక్‌ని సర్వింగ్ గ్లాసుల్లో పోసి ఇంటికొచ్చిన అతిథులకు అందించండి.
కావాల్సిన పదార్థాలు
అరటి పండ్లు-2
పాలు- 2 కప్పులు
వెనిల్లా ఐస్‌క్రీమ్-3 కప్పులు
వెనిల్లా ఎక్ట్స్రాక్ట్-1/2 టేబుల్ స్పూన్
తయారుచేసే విధానం
ముందుగా అరటి పండును చిన్న ముక్కలుగా కట్‌చేసి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పాలు పోసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు అందులో వెనిల్లా ఐస్‌క్రీమ్, పాలు, వెనిల్లా ఎక్ట్స్రాక్స్ వేసి మరింతగా బ్లెండ్ చేసుకోవాలి. పల్చగా మారిన ఈ మిశ్రమాన్ని ఒక కంటెయినర్లో పోసి ఫ్రిజ్‌లో అరగంట సేపు ఉంచాలి. తర్వాత కొంచెం బాదం, కిస్మిస్లతో డెకరేట్ చేసి పిల్లలకు అందించండి.
ముంజలతో మిల్క్ షేక్
కావాల్సిన పదార్థాలు
ముంజలు-3
పాలు - 1 కప్పు
పంచదార - 3 టీ స్పూన్లు
కుంకుమ పువ్వు రేకలు -4
తయారుచేసే విధానం
ముంజలు రెండుగా విడిపోకుండా జాగ్రత్తగా పై పెచ్చును తొలగించాలి. పెచ్చు తీసిన ముంజలను మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత జార్లో పాలు, పంచదార, కుంకుమ పువ్వు కూడా వేసి పల్చని జ్యూస్‌లా తయారయ్యేలా మరోసారి బ్లెండ్ చేయాలి. ఇక సర్వింగ్ గ్లాసుల్లోకి జ్యూస్‌ని తీసుకుని ఐస్ ముక్కలు వేసి చల్లని జ్యూస్‌ని పిల్లలకిస్తే ఇష్టంగా తాగేస్తారు. వేసవిలో ఈ జ్యూస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది.
మామిడి బొప్పాయి మిల్క్ షేక్
