శ్రీకాకుళం : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలుమూరు మండలంలోని చల్లవానిపేట పిఎసిఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధరను రైతులందరికీ అందించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, రైతులు దళారుల వద్ద మోసపోకుండా ప్రభుత్వం ప్రారంభించిన ఈ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
